సాయంత్రం సమయంలో పువ్వులను కోయకూడదు.... ఎందుకో తెలుసా?

మన పెద్దవాళ్ళు సాయంత్రం సమయంలో పువ్వులను కోయవద్దని చెప్పుతారు.సాయంత్రం సమయంలో పువ్వులను కోయటం వలన ఏమైనా కీడు జరుగుతుందా? మన పెద్దలు ప్రకృతి పరంగా మరియు శాస్త్రీయమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆచారాలను ఏర్పాటు చేసారు.

వాటి వెనుక కారణాలు తెలుసుకోకుండా గుడ్డిగా పాటిస్తే కొంతకాలానికి అవి మూఢనమ్మకాలుగా మారతాయి.

నిజానికి సాయంకాలం పూవులను కోయరాదు అని చెప్పడంలో ప్రకృతి పరమైన కారణాలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.సాయంత్రం వెలుతురు తగ్గే సమయం మరియు చల్లగా ఉండుట వలన పురుగులు, పాములు వంటి విష జంతువులు చెట్ల మీద సేద తీరుతాయి.

Why Is It Advised Not To Pluck Flowers In The Evening?-Why Is It Advised Not To

మనం ఆ సమయంలో చెట్ల వద్దకు వెళ్లి పూలను కొస్తే ఆ విష జంతువుల బారిన పడతామని పూవులను సాయంత్రం కోయవద్దని పెద్దవారు చెప్పుతారు.

ఎండిన కొబ్బరితో దొరికే అధ్బుతమైన లాభాలు
Advertisement

తాజా వార్తలు