యాపిల్ ఫోన్‌కు ఎందుకంత రేటు

శామ్‌సంగ్, లెనోవో, మోటో ఇలా ఎన్ని ర‌కాల బ్రాండ్లు ఉన్నా.

యాపిల్‌కు ఉన్న క్రేజ్ వేరు! ఒక్కసారైనా యాపిల్ స్మార్ట్‌ ఫోన్‌ను ఉప‌యోగించాలనుకునే వారు కోకొల్ల‌లు! కొత్త సిరీస్ విడుద‌ల‌వుతోంద‌ని తెలిస్తే చాలు.

దుకాణాల ముందు క్యూలు క‌ట్టేస్తుంటారు! ఆస్తులు అమ్ముకుని మ‌రీ.యాపిల్ ఫోన్‌ను కొనేస్తుంటారు.మ‌రి యాపిల్‌కు అంత క్రేజ్ ఎందుకు? రూ.30 వేలు, రూ.40 వేలు, చివ‌ర‌కు రూ.60వేలు అయినా ఎందుకు అంద‌రూ ఎగ‌బ‌డి కొంటారు? మ‌రి యాపిల్‌ను ఇంత‌టి అగ్ర‌స్థానంలో నిల‌బెట్టిన ఆస‌క్తిక‌రమైన విష‌యాలు తెలుసుకోవాల‌నుకుంటున్నారా.వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది క్వాలిటీ! యాపిల్ ఎప్పుడూ క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాదు.

Why IPhone Is So Costly?-Why IPhone Is So Costly-General-Telugu-Telugu Tollywood

ఎప్పుడూ ప్రీమియం క్వాలిటీ విభాగాల‌నే అన్నింటికీ ఉప‌యోగిస్తుంది.అలాగే రెండోది ఆర్ అండ్ డీ! రీసెర్చి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలో కొన్ని వంద‌ల మంది ఇంజ‌నీర్లు నిరంతరం ప‌నిచేస్తూ ఉంటారు.కొత్త‌గా త‌యారు చేసేందుకు శ్ర‌మిస్తూ ఉంటార‌ట‌.2007 నుంచి 2016 వ‌ర‌కూ మొత్తం 15 ఐఫోన్ మోడ‌ల్స్ మాత్రమే విడుద‌ల‌య్యాయి అంటే ఆర్ అండ్ డీ అనేది యాపిల్‌కి ఎంత కీల‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు! ఇక మూడోది ఆప్టిమైజేష‌న్‌.ఆండ్రాయిడ్ ఫోన్ల సాఫ్ట్‌వేర్ ఒక‌చోట‌, హార్డ్‌వేర్ వేరే చోట త‌యారవుతాయి! అందుకే ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ క్రాష్, హ్యాంగ్ అవ‌డం వంటి లోపాలు ఉంటాయి! కానీ యాపిల్ విష‌యానికి వ‌స్తే.

హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ అన్నీ యాపిల్ కంపెనీనే త‌యారు చేస్తుంది.అందుకే యాప్ క్రాష్, హ్యాంగ్ అవ‌డం వంటివి ఉండ‌నే ఉండ‌వు! అలాగే బ్యాట‌రీ విష‌యంలోనూ యాపిల్‌తో ఆండ్రాయిడ్ ఫోన్లు పోటీ ప‌డలేవు! అందుకే ఎక్కువ మంది యాపిల్‌కి ఓటేస్తారు.

Advertisement

ఇక యాపిల్ ఫోన్ల‌లో సెక్యూరిటీ కూడా అధికం.హ్యాకింగ్‌కు అవ‌కాశం చాలా త‌క్కువ‌! త‌ర్వాత‌.ఆండ్రాయిడ్ ఫోన్లకు అప్‌డేట్ త్వ‌ర‌గా వ‌చ్చినా.

అవి మార్కెట్‌లోకి వ‌చ్చే కొత్త ఫోన్ల‌కే ఆ అవ‌కాశం ఉంటుంది.ప్ర‌స్తుతం త‌క్కువ వెర్ష‌న్ వాడుతున్న వారికి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ చేసే అవ‌కాశం ఉండ‌దు.

కానీ ఐఫోన్‌కు మాత్రం ఈ అవ‌కాశం ఉంది.ఐవోఎస్ త‌క్కు వ వెర్ష‌న్ వాడుతున్న వారు కూడా హ‌య్య‌ర్ వెర్ష‌న్‌కి మార్పు చేసే అవ‌కాశం కూడా ఉంది.

ఒక అప్‌డేట్ రిలీజ్ అయితే.అది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న యాపిల్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి వ‌స్తుంది.

పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?

ఇక సేల్స్ అండ్ స‌ర్వీసింగ్‌లోనూ యాపిల్ ఫ‌స్ట్‌.ఇక అడ్వ‌ర్ట‌యిజింగ్.

Advertisement

యాపిల్ ఈ అంశంపైనే ఎక్కువ ఫోక‌స్ పెడుతుంది.గ్రాండ్ ఓపెనింగ్ చేస్తుంది.

ఇక చివ‌రిది బ్రాండ్ వాల్యూ!! యాపిల్ బ్రాండ్ వాల్యూ కోసం కొనేవాళ్లే ఎక్కువ‌మంది! .

తాజా వార్తలు