గుడిలో తల మీద షడగోప్యం (శఠగోపం) ఎందుకు పెట్టించుకోవాలి?

దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక తీర్ధం తీసుకోవటం మరియు షడగోప్యం పెట్టించుకోవటం తప్పనిసరిగా చేయాలి.

కానీ చాలా మంది దేవుని దర్శనం అయ్యాక షడగోప్యం (శఠగోపం) పెట్టించుకోకుండా హడావిడిగా వెళ్లి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుంటారు.

అయితే చాలా మందికి శఠగోపం ఎందుకు పెట్టించుకోవాలో తెలియదు.శఠగోపం పెట్టించుకోవటంలో ఒక అర్ధం ఉంది.

శఠగోపం పెట్టించుకొనే సమయంలో మన కోరికను పూజారికి కూడా విన్పించకుండా తలచుకోవాలి.మనిషికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యములకు దూరంగా ఉంటామని తలచుకుంటూ శఠగోపం పెట్టించుకోవాలి.

కానీ చాలా మంది చిల్లర లేదనే కారణంతో శఠగోపం పెట్టించుకోవటం మానేస్తు ఉంటారు.అలా మానేయటం చాలా తప్పు.

Advertisement

తప్పనిసరిగా శఠగోపం పెట్టించుకోవాలి.రాగి, కంచు, వెండిలతో తయారుచేసిన షడగోప్యంపై విష్ణు పాదాలు ఉంటాయి.

అంతేకాక షడగోప్యం తల మీద పెట్టినప్పుడు అందులో ఉండే లోహం మన శరీరంలో అధికంగా ఉన్న విధ్యుత్ బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది.దాంతో ఆందోళన,ఆవేశం తగ్గుతాయి.

Advertisement

తాజా వార్తలు