పూజ హెగ్డే తో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు ఎందుకు భయపడుతున్నారు? అసలు కారణం ఇదే!

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ( Tollywood ) లో చేతినిండా ఆఫర్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde ), ఈమధ్య అకస్మాత్తుగా మాయం అయిపోయింది ఏమిటబ్బా.

! అని అందరూ అనుకున్నారు.

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల వల్లే పూజా హెగ్డే కి ఆఫర్స్ తగ్గిపోయాయని అందరూ అనుకున్నారు.కానీ అసలు విషయం వేరే ఉంది.

ఈమెకి ఆఫర్స్ రాకపోవడానికి కారణం రెమ్యూనరేషన్ అట.ఇప్పటి వరకు ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే రెండు రెట్లు ఎక్కువ ఇస్తేనే సినిమాకి సంతకం చేస్తాను అని నిర్మాతలతో చెప్తుందట.

అంతే కాదు ఆమె తో పాటు వచ్చే స్టాఫ్ ఖర్చులు, ఈమె హోటల్ ఖర్చులు, తిండి ఖర్చులు , ఇలా అన్నీ కూడా నిర్మాతలే చూసుకోవాలి అంట.ఈ డిమాండ్స్ అన్నిటికీ ఓకే చెప్తేనే డేట్స్ ఇస్తుందట.దీంతో దెబ్బకి ఈమెకి దండం పెట్టి, శ్రీలీల వైపు అందరూ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది.

Why Are Producers Afraid To Make Films With Pooja Hegde This Is The Real Reason
Advertisement
Why Are Producers Afraid To Make Films With Pooja Hegde This Is The Real Reason

ఇంతకు ముందు పూజా హెగ్డే ఒక్కో సినిమాకి మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునేది.కానీ ఇప్పుడు మాత్రం ఆమె 8 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.ఈమెలో అకస్మాత్తుగా ఇలాంటి మార్పు రావడానికి కారణం, ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టడమే.

ముందుగా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం( guntur karam ) చిత్రం లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.ఈ సినిమా మధ్యలోనే ఆమె మరో బాలీవుడ్ చిత్రానికి కమిట్మెంట్ ఇచ్చింది.

రెండు సినిమాల షెడ్యూల్స్ కి క్లాష్ రావడం తో ఆమె గుంటూరు కారం నుండి తప్పుకోవడమే బెటర్ అని ఆ చిత్రం నుండి తప్పుకుంది.దీంతో ఈ ఆమె స్థానం లోకి హీరోయిన్ శ్రీలీల ని తీసుకున్నారు.

అలా ఇక్కడి నుండే ఆమె టాలీవుడ్ ని మెల్లగా దూరం పెట్టడం ప్రారంభించింది.

Why Are Producers Afraid To Make Films With Pooja Hegde This Is The Real Reason
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

బాలీవుడ్( Bollywood ) లో హీరోయిన్స్ కి భారీగానే రెమ్యూనరేషన్స్ ఇస్తుంటారు, పూజ హెగ్డే కి కూడా అలాగే భారీ గా రెమ్యూనరేషన్ ఇచ్చారు, అక్కడ ఆ ఆశ చూపేలోపు ఆమె ఎక్కువగా అక్కడే సినిమాలు చెయ్యడానికి ఒప్పుకుంది.టాలీవుడ్ లో ఒక్క సినిమాకి సంతకం చెయ్యాలంటే కచ్చితంగా అంత రెమ్యూనరేషన్ ని ఇస్తేనే చేస్తుందట.అందుకే ఈమె వైపు కూడా చూసేందుకు దర్శక నిర్మాతలు భయపడుతున్నారు.

Advertisement

ఇదంతా పక్కన పెడితే ఈమె రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ మరియు సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న గంజా శంకర్ చిత్రం లో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకోసం ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో అనే చర్చలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు