Akkineni Nageswara Rao: అన్నపూర్ణ స్టూడియో అక్కినేని ఇంత కసిగా కట్టారా ?

తెలుగు సినిమా చరిత్రలో ఒక చిరస్మరణీయ వ్యక్తి అక్కినేని నాగేశ్వర రావు గారు.

( Akkineni Nageswara Rao ) రాష్ట్ర విభజన జరిగినప్పటికీ తెలుగు సినిమాలన్నీ చెన్నై లోనే జరుగుతుండేవి.

అలాంటి సమయంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి సొంతంగా ఒక స్టూడియో నిర్మించారు అక్కినేని నాగేశ్వరరావు గారు.అదే ఇప్పుడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్.

( Annapurna Studios ) అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అక్కినేని నాగేశ్వర రావు గారి లెగసీ లో భాగం.మరి నాగేశ్వర రావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాలని అనుకోవడానికి ప్రధాన కారణం మరొకటి ఉంది.

అదేమిటంటే.

Advertisement

నిజానికి నాగేశ్వర రావు గారికి స్టూడియో కట్టాలనే ఉద్దెశం వచ్చేదే కాదట.ఒక సారి నాగేశ్వరరావు గారికి సారధి స్టూడియో( Saradhi Studio ) వాళ్ళతో గొడవ జరిగిందట.నాగేశ్వర్ రావు గారు దేవదాసు చిత్రంలో( Devadasu Movie ) నటించిన విషయం మనందరికీ తెలిసినదే.

ఈ చిత్రం 1953 లో విడుదలయింది.నాగేశ్వర రావు గారి సినీ ప్రయాణంలో ఈ చిత్రం ఒక మైలురాయి.

ఐతే 1974 లో సూపర్ స్టార్ కృష్ణ గారు మళ్ళి దేవదాసు చిత్రాన్ని తీశారు.ఈ చిత్రం విడుదల అయినప్పుడు నాగేశ్వర రావు గారి దేవదాసు చిత్రాన్ని కృష్ణ గారి దేవదాసు చిత్రానికి పోటీగా రి రిలీజ్ చేశారట.

ఈ విషయమై నాగేశ్వరరావు గారికి సారధి స్టూడియో వాళ్ళతో గొడవ మొదలయింది.కృష్ణ గారి దేవదాసు నిర్మించడంలో నవయుగ స్టూడియోస్ వారి పాత్ర కూడా ఉంది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

వీరందరూ కలసి నాగేశ్వరరావు గారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

Advertisement

ఆతరువాత నాగేశ్వరరావు గారు, అంజలి దేవి గారు కలిసి నడిచిన సినిమా మహా కవి క్షేత్రయ్య చిత్రం( Mahakavi Kshetrayya ) షూటింగ్ మొదలు కావలసి ఉంది.ఐతే సారథి స్టూడియోస్ వారు స్టూడియో ఖాళి లేదని షూటింగ్ కు అనుమతి ఇవ్వలేదట.అప్పుడు ఆ సినిమా షూటింగ్ ని బెంగళూరు లోని చాముండేశ్వరి స్టూడియోలో చేశారట మేకర్స్.

అప్పుడే నాగేశ్వరరావు గారికి తానే సొంతగా స్టూడియో నిర్మించాలి అనే ఆలోచన వచ్చిందట.ఐతే హైదరాబాద్ లో ఫిలిం స్టూడియో కట్టాలని కంకణం కట్టుకున్న నాగేశ్వరరావు గారికి అప్పటి ముఖ్యమంత్రి స్టూడియో కోసం స్థలం కేటాయిస్తాం అని మాట ఇచ్చినా, తనకు ఉచితంగా వద్దని ప్రభుత్వం నుంచి స్థలాన్ని కొనుగోలు చేసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారట నాగేశ్వరరావు గారు.

తాజా వార్తలు