పంచాయ‌తీపై ఎవ‌రి లెక్క‌లు వారివే... అస‌లేం జ‌రిగింది ?

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి లెక్క‌లు వారివేనా? అంటే ఔననే అంటున్నారు జ‌న‌సేన నాయ‌కులు వాస్త‌వానికి ప్ర‌స్తుతం జ‌న‌సేనఅంటే బీజేపీతో కూడిన జ‌న‌సేన అని అర్ధం.

కానీ, ఎక్క‌డా జ‌న‌సేన నాయ‌కులు ఇటీవ‌ల కాలంలో బీజేపీ గురించి ప్ర‌స్తావించ‌డం లేదు.

క‌నీసం ఆ పార్టీ ఊసు కూడా ఎత్త‌డం లేదు.ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీల మ‌ధ్య మేం ఇన్ని పంచాయ‌తీలు పోగేసుకున్నాం అంటే కాదు మీది రాంగ్‌ మేం ఇన్ని పోగేసుకున్నాం మీకు ఇవే వ‌చ్చాయి.

అని స‌వాళ్ల రాజ‌కీయం న‌డుస్తోంది.ఇదిలావుంటే జ‌న‌సేన నాయ‌కులు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

త‌మ‌కు వ‌చ్చిన పంచాయ‌తీల లెక్క‌లు బాగానే చెబుతున్నారు.అయితే.

Advertisement
Whose Calculations Are They On The Panchayat ... What Actually Happened,ap,ap Po

ఇక్క‌డ క్లారిటీ మిస్స‌యింది.బీజేపీతో పొత్తు విష‌యాన్ని మాత్రం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌డం లేదు.

 మొదటి దశ పంచాయితి ఎన్నికల్లో జనసేనకు 18 శాతం ఓట్లొచ్చినట్లు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు.తొలిదశ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే జనసేన మద్దతుతో పోటీచేసిన వారు 18 శాతం ఓట్లు సాధించిన విషయం స్పష్టమైందన్నారు.

తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు వెయ్యికిపైగా వార్డులో గెలిచారని చెప్పుకొచ్చారు.అలాగే 1700 పంచాయితీల్లో రెండోస్ధానంలో నిలిచినట్లు చెప్పుకొచ్చారు.

Whose Calculations Are They On The Panchayat ... What Actually Happened,ap,ap Po

అంతేకాదు ఈ ప‌రిణామం.త‌మ‌కు అనుకూలంగా ఉంద‌ని పేర్కొన్నారు.ప్ర‌జ‌లు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని వారిలో ఆలోచ‌న మారుతోంద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అయితే  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిత్రపక్షం బీజేపీ విషయాన్ని జ‌నసేన‌ ఎక్కడా ప్రస్తావించలేదు.వాస్త‌వానికి ఆదినుంచి బీజేపీ, జ‌న‌సేన‌లు చెప్పింది క‌లిసి పోటీ చేస్తున్నామ‌ని రెండు పార్టీలు క్షేత్ర‌స్థాయిలో క‌లిసే అభ్య‌ర్థ‌లుకు మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని చెప్పారు.

Advertisement

కానీ లెక్క‌ల విష‌యానికి వ‌స్తే మాత్రం  తమ పార్టీకి సంబంధించి మాత్రమే జ‌న‌సేన నేత‌లు వివ‌రించారు.తాము బ‌ల‌ప‌డ్డామ‌ని కూడా పేర్కొన్నారు.

మరి బీజేపీ విష‌యం ఏంటి? ఆ పార్టీ ఖాతాలో పడిన వార్డులు, పంచాయితీల లెక్కలు ఎందుకు చెప్పలేదు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.పైగా తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన మ‌ద్ద‌తుతో టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు.సో ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే రాజ‌కీయంగా కూడా బీజేపీ, జ‌న‌సేన‌లు ఎవ‌రి లెక్క‌లు వారు చూసుకుంటున్నారా?  అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.అంటే వీరి మ‌ధ్య‌పొత్తు ఎంతో కాలం ఉండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

తాజా వార్తలు