దుబ్బాక గెలుపు చెప్ప‌డం క‌ష్ట‌మేనా... తీవ్ర ఉత్కంఠ‌..!

దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితం మ‌రికొద్ది గంట‌ల్లో వెలువ‌డ‌నుంది.ఎవ‌రి అంచ‌నాల్లో వారు ఉన్నారు.

అక్క‌డ నిజంగానే బీజేపీ గ‌ట్టి పోటీ ఇచ్చిందా ?  బీజేపీ గెలుస్తుందా ?  టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తుందా ?  బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్ భ‌య‌ప‌డిందా ?  లేదా ఎప్ప‌టిలాగానే టీఆర్ఎస్ వార్ వ‌న్‌సైడ్ అయ్యిందా ? అన్న‌ది గంట‌ల్లోనే తేలిపోనుంది.అధికార పార్టీపై వ్య‌తిరేక‌త ఉంద‌ని.

అదే త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని బీజేపీ లెక్క‌లు వేసుకుంటోంది.పోయిన ఎన్నిక‌ల్లోనే త‌మ‌కు 62 వేల మెజార్టీ వ‌చ్చింద‌ని.

ఈ సారి ల‌క్ష దాటుతుంద‌ని టీఆర్ఎస్ చెపుతోంది.కాంగ్రెస్ పోటీలో ఉన్నా వ‌చ్చేది మూడో స్థాన‌మే అంత‌కు మించి గొప్ప ఏం ఉండ‌దు.

Advertisement

రామ‌లింగారెడ్డి ఇక్క‌డ నాలుగు సార్లు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆయ‌న మృతితో జ‌రుగుతోన్న ఉప ఎన్నిక కావ‌డం.

స్వ‌యంగా ఆయ‌న భార్యే పోటీలో ఉండ‌డంతో సానుభూతి ప‌ని చేస్తుంద‌ని అంద‌రూ అనుకున్నా అది వ‌ర్క‌వుట్ కాలేదు.ఇక బీజేపీ మాత్రం దుబ్బాకలో ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

గెలుపు ఓట‌ములు ఎలా ?  ఉన్నా దుబ్బాక‌లో మాత్రం బీజేపీ టీఆర్ఎస్‌ను భ‌య‌పెట్టింద‌న్న‌ది నిజం.భ‌విష్య‌త్తులో తెలంగాణ రాజ‌కీయాల్లో టీఆర్ఎస్‌కు బ‌ల‌మైన శ‌త్రువు తామే అని.కాంగ్రెస్‌ది ఇక్క‌డ మూడో స్థాన‌మే అన్న సంకేతాలు మాత్రం పంపింది.ఇక ఏ ఎన్నిక‌లు అయినా మెద‌క్ జిల్లాలో ఇప్ప‌టికే నాలుగు సార్లు ఓడిన ర‌ఘునంద‌న్‌రావు పోటీ చేయ‌డం కూడా బీజేపీకి సానుభూతి బాగా క‌లిసి వ‌చ్చింది.

బీజేపీ త‌ర‌పున ఇక్క‌డ కేంద్ర‌, రాష్ట్ర స్థాయి నేత‌లు ప్ర‌చారం చేశారు.ఇక అన్ని పార్టీల క‌న్నా అభ్య‌ర్థి విష‌యంలో ముందే స్ప‌ష్ట‌త ఉండ‌డంతో పాటు ప్ర‌చారం కూడా ముందే ప్రారంభించ‌డం బీజేపీకి చాలా ప్ల‌స్ అయ్యింది.

ఏదేమైనా మ‌రి కొద్ది గంట‌ల్లో ఫ‌లితాలు వెలువ‌డుతోన్న వేళ దుబ్బాక‌లో ఎవ‌రు గెలుస్తార‌న్న‌దానిపై పెద్ద స‌స్పెన్సే నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు