అల్లు అరవింద్, పరుశురాం కి మధ్య జరిగిన గొడవ కి కారణం ఎవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరుశురాం డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా మీదనే విజయ్ దేవరకొండ చాలా అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళ కాంబో లో వచ్చిన గీత గోవిందం సినిమా( Geetha Govindam movie ) సూపర్ హిట్ అయినప్పటికీ తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబో లో ఈ సినిమా వస్తుంది.

ఇక ఈ కాంబో లో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో స్టోరీ కి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని మరి దర్శకుడు ఈ సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

దర్శకుడు పరుశురాం ( Parushuram )గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే చాలా సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నాడు.

Advertisement

ఇక ఇప్పుడు విజయ్ తో మళ్ళీ రెండో సినిమా చేస్తూ మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే తను ఈ సినిమాని తనను గీత ఆర్ట్స్ బ్యానర్ ( Geetha Arts Banner )లో చేయాల్సింది.కానీ గీత ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ కి పరుశురాం మధ్య మధ్య విభేదాలు రావడంతో ఆయన దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నాడు.

ఇక వీళ్ళ మధ్య ఏం జరిగింది అంటే అల్లు అరవింద్ తన కొడుకు అయిన శిరీష్ తో ఒక సినిమా చేయమని అడిగితే పరుశురాం దానికి ఇష్టపడలేదట ఇప్పటికే శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా చేశాడు అది మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇంకో సినిమా చేయాలంటే కుదరదు అని పరుశురాం అనడంతో ఆయనతో నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేయలేనని అరవింద్ చెప్పడం తో పరుశురాం దిల్ రాజు తో మూవీ చేయడానికి రెఢీ అయ్యాడు.

ఇక ఇంతకు ముందు గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే గీత గోవిందం సినిమా రావడం జరిగింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement