Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం

తెలంగాణ అసెంబ్లీలో నీటి పారుదల రంగంపై కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.

అలాగే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు.

గతంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.

గతం కంటే ఈ పదేళ్ల కాలంలో నదీ జలాల విషయంలో మరింత నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు.పోతిరెడ్డిపాడు( Pothireddy Padu ) సామర్థ్యాన్ని పెంచి నీటిని ఏపీకి తరలించారని ఆరోపించారు.తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీ పాలకులు తరలించుకున్నారని మండిపడ్డారు.

Advertisement

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గత కాంగ్రెస్ పాలనలో 727 టీఎంసీలు నీరు వెళితే బీఆర్ఎస్ పాలనలో 1200 టీఎంసీలు తరలించారని తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు