ఈ రోజు జరిగే ఆర్సిబి వర్సెస్ లక్నో మ్యాచ్ లో గెలిచేది ఏ టీమ్ అంటే..?

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ప్రతి టీం కూడా తనదైన రీతి లో సత్తా చాటాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కొన్ని టీములు గెలవలేక ఇబ్బంది పడుతుంటే మరికొన్ని టీమ్ లు మాత్రం వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

ఇక అందులో భాగంగానే ఆర్సిబి( Royal Challengers Bengaluru ) కూడా ఈసారి కప్పుకోట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగింది.ఇక ఇప్పటికి మూడు మ్యాచ్ లు ఆడిన ఆర్సిబి అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించడం అనేది ఆ టీం యొక్క బలహీనతల్ని తెలియజేస్తుంది.

ఇక దాంతో పాటుగా లక్నో సూపర్ జాయింట్స్ టీం కూడా రెండు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక విజయాన్ని సాధించి ఒక మ్యాచ్ లో ఓటమిపాలైంది.

అయితే ఈ రెండు జట్ల మధ్య ఈరోజు జరిగే మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుంది అనే దానిమీద సర్వత్ర ఆసక్తి నెలకొంది.అయితే ఈ రెండు టీముల్లో ఏదో ఒకటి భారీ విక్టరీని సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే బెంగళూరు టీం గెలిచి తమ సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తుంటే లక్నో టీమ్( Lucknow Super Giants ) కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

ఇక ఇలాంటి క్రమం లో ఈ రెండు టీముల మధ్య ఇవాళ్ళ జరిగే మ్యాచ్ పోటాపోటీగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది.ఇక బెంగళూరులో డూప్లేసిస్, విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్, దినేష్ కార్తీక్, కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉండటం ఆ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.

ఇక ఈ ప్లేయర్లు టీమ్ లో అత్యుత్తమమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు.

ఇక లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ విషయానికి వస్తే కే ఎల్ రాహుల్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్ లాంటి ప్లేయర్లు అద్భుతమైన ఫామ్ లో ఉండి, టీమ్ ని ముందుండి మరి నడిపిస్తున్నారు.ఇక ఈ టీమ్ భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.అయితే ఇవాళ్టి మ్యాచ్ లో ఆర్సిబి కి 55% గెలిచే అవకాశం ఉంటే, లక్నో టీమ్ కి 45% మాత్రమే గెలిచే అవకాశం ఉంది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు