ఇంట్లో క్రిస్టల్ తాబేలును ఏ దిక్కున పెడితే మంచిది..?

చాలామంది ఇల్లు, షాపులు, ఆఫీసు, టేబుల్ మీద క్రిస్టల్ తాబేలు ( crystal turtle )పెట్టుకొని ఉండడం చూస్తూనే ఉంటారు.

అయితే నీళ్లు పోసి క్రిస్టల్ తాబేలు పెట్టి అందులో కొంతమంది గులాబీ రేకులు కూడా వేస్తారు.

ఇది చూసేందుకు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమ పెట్టుకుంటే చాలా మంచిది.

ఇక ఫెంగ్ షూయిలో తాబేలు చిహ్నానికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది.అయితే పురాణాల ప్రకారం సాగర మథనం సమయంలో విష్ణువు( Lord vishnu ) తాబేలు అవతారాన్ని తీసుకున్నాడు.

కాబట్టి కూర్మావతారంలో ఉన్న విష్ణువుని చాలామంది పూజిస్తారు.అలాగే తాబేలు ఇంటికి ఆనందం, విజయాన్ని అందిస్తుందని నమ్ముతారు.

Advertisement

ఒక్కో రకమైన తాబేలుకి ఒక్క ప్రాముఖ్యత ఉంది.ఇల్లు లేదా ఆఫీసు ప్రవేశ ద్వారం దగ్గర తాబేలు ఉంచినట్లయితే ప్రతికూల శక్తి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.

అలాగే ఎటువంటి తాబేలు పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా తాబేలు సంపదని సూచిస్తుంది.

ఇంట్లో లేదంటే దుకాణాల్లో క్రిస్టల్ తాబేలు ఉంచడం వలన ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి.అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కాపాడుతుంది.

క్రిస్టల్ తాబేలు ఇంట్లో పెట్టుకోవడం వలన ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి.వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో తాబేలు బొమ్మ పెట్టుకోవడం మంచిది.ఎందుకంటే ఈ దిక్కుని కుబేరుడు పరిపాలిస్తాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025

కాబట్టి ఆ వైపు పెట్టుకుంటే ఆర్థికంగా బలపడతారు.ఉత్తరం లేదా వాయువ్య దిశలో మెటల్ తాబేలు అమర్చుకోవడం మంచిది.

Advertisement

దీంతో పిల్లల జీవితం బాగుంటుంది.అలాగే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది.

ఇక చెక్క తాబేలు తూర్పు లేదా ఆగ్నేయంలో ఉంచడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది.

దీంతో మీ జీవితం ఆనందంగా మారుతుంది.అలాగే విజయాలు సాధిస్తారు.అయితే ఇంట్లో తాబేలు పెట్టుకోవడం వలన శుభప్రదం.

అలాగే సమృద్ధిని సూచిస్తుంది.తాబేలు విష్ణు అవతారం కావడం వలన మీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది.

ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవడం వలన అనేక ప్రయోజనాలు పొందుతారు.ఇది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.

అలాగే పడకగదిలో కూడా తాబేలు బొమ్మ పెట్టుకుంటే నిద్రలేమి సమస్యల నుండి బయటపడవచ్చు.

తాజా వార్తలు