వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో ఫీచర్...

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కి( Whatsapp ) ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వాట్సాప్ వినియోగం పెరిగిన దగ్గర నుండి ప్రతీఒక్కరు వారి బంధుమిత్రులకు కాల్స్ చెయ్యడం ఎక్కువైపోయింది.

ప్రపంచంలో ఎక్కడున్నా వారితోనైనా సులభంగా వాట్సాప్‌ కాల్స్ చేసుకోవచ్చు వీడియో ఆడియో కాల్ ఫెసిలిటీ కూడా వాట్సాప్ అందిస్తోంది.ఈ కాలింగ్ ఫెసిలిటీని మరింత ఇంప్రూవ్ చేయడానికి వాట్సాప్ డెవలపర్లు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌ పరిచయం చేస్తున్నారు.

దీనిని మరింత బెటర్ చేసేందుకు ఇప్పుడు మరో కొత్త మార్పు చేయబోతున్నారు.

ప్రస్తుతం వాట్సాప్ ఓపెన్ చేసి కాల్స్ ట్యాబ్ లోకి వెళ్తే పై భాగం లో కాల్స్ లింక్స్( Calls Links ) అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది.ఈ ఆప్షన్ ప్లేస్ లో త్వరలోనే న్యూ కాల్ ( New Call ) అనే ఒక కొత్త ఆప్షన్ ని యాడ్ చెయ్యనున్నారు.దీనితో యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ అవ్వనుంది.

Advertisement

అయితే కేవలం ఇదొకటే ఆప్షన్ కి కాకుండా మరొక ఆప్షన్ ని కూడా యాడ్ చేసారు.అదేంటంటే ప్రస్తుతం వాట్సాప్ లో కేవలం 15 మందికి మాత్రమే వాట్సాప్ కాల్( Whatsapp Call ) యాడ్ ఆప్షన్ ఉంది.కానీ త్వరలోనే వాట్సాప్ కాల్ కు మరో 31 మందిని యాడ్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది

ఈ క్రమంలోనే వాట్సాప్‌ బీటా ఇన్ఫో వెబ్ సైట్ ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది.వాట్సాప్ కాల్ లో 31 మందిని యాడ్ చేసే ఆప్షన్ ని ప్రస్తుతం వాట్సాప్ బీటా 2.23.19.16 వెర్షన్ టెస్టింగ్ దశలో ఉందని తెలిపింది.అలానే వాట్సాప్ వీడియో కాలింగ్ లో అవతార్ ఫీచర్ ని తీసుకురావాలని ప్రయత్నిస్తుంది.

ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే మనం ఎవరికైన వీడియో కాల్ చేసినప్పుడు మనం ముఖం కనపడకుండా యూజర్ అవతార్ కనపడుతుంది.ఈ అవతార్లను మనం ముఖానికి అనుగుణంగా తయారు చేయవచ్చు.

ఈ ఫీచర్ కూడా బీటా వెర్షన్ లో ఉంది.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు