షర్మిల కేసు వెనుక ఉన్న తిరకాసు ఏంటి...?

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పై సోషల్ మీడియాలో అసభ్య కథనాలు ప్రచారంచేస్తూ.

ఆమెకు ఓ ప్రముఖ హీరోతో సంబంధం ఉందంటూ.

ఒకదశలో విస్తృతమైన ప్రచారం జరిగింది.అయితే అప్పట్లో ఈ విషయంపై కొంచెం హడావుడి చేసినా.

అంత సీరియస్ గా తీసుకోలేదు.కానీ ఇప్పుడు ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఏమో తెలియదు కానీ.

ఇప్పుడు మాత్రం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని కేసు వరకు వెళ్లిపోవడం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తూ.కేసు వేగవంతం అయ్యేలా చేయడంతో ఈ తతంగం వెనుక ఉన్న కొంతమంది పెద్దలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

Advertisement

ఈ కేసులో హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది.ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.యూట్యూబ్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసి దాదాపు 60 పోస్టులపై తీవ్ర అసభ్యకర కామెంట్లు చేసిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావును గుంటూరులో అరెస్టు చేశారు.

తాజాగా.వెంకటేశ్వరరావు మాదిరిగానే షర్మిలపై సోషల్ మీడియా లో అసభ్యకర కామెంట్లు చేసిన మరొకరిని మంచిర్యాలలో సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిని హైదరాబాద్‌కు తరలించారు.

అలాగే షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసిన మరో ఐదుగురి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

ఈ కేసులో ఇలా ఒక్కొక్కరు ఈ విధంగా అరెస్ట్ అవుతుండడంతో తెర వెనుక చక్రం తిప్పిన నిందితులు తామ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని ఆందోళన చెందుతున్నారు.కొందరు పెద్దల సహకారం, ఆజ్ఞల మేరకే ఈ సోషల్ మీడియా దాడి జరిగినట్టు తెలంగాణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇప్పటికే దొరికిన నిందితులపై ఐ పీసీ సెక్షన్‌ 509, 67(ఎ) ఐటీ యాక్ట్‌తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసులో అప్పట్లో యాక్టివ్ గా స్పందించి అనేకమంది టీడీపీ నాయకుల వివరాలను కూడా తెలంగాణ పోలీసులు ఆరాతీస్తుండడం సదరు నాయకులకు ఆందోళన కలిగిస్తోంది.అయితే తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ వ్యవహారంపై మరింత ముందుకు వెళ్లి టీడీపీ నాయకులను ఇరికించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది.

Advertisement

అయితే ఈ కేసు వైసీపీకి ఎంత మైలేజ్ తీసుకొస్తుందో చూడాలి.

తాజా వార్తలు