టూత్‌పేస్ట్‌పై ఉండే ఈ గుర్తుల‌లోని ర‌హ‌స్యం గురించి మీకు తెలుసా?

ఉదయాన్నే నిద్రలేచాక‌ టూత్‌పేస్ట్‌తో ప‌ళ్లు తోముకుంటాం.టూత్‌పేస్ట్ కొనడానికి ముందు, ఆ టూత్‌పేస్ట్ మీ దంతాలకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవాలి.

టూత్ పేస్టు ట్యూబ్‌కు దిగువ‌న ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల గుర్తులు కనిపిస్తాయి.ఈ గుర్తుల‌ ద్వారా టూత్‌పేస్ట్ నాణ్యతను గుర్తించ వచ్చని కొంద‌రు చెబుతూ, ఆ విష‌యాన్ని వైర‌ల్ చేస్తుంటారు.

బ్లాక్ మార్క్ ఉన్న టూత్ పేస్ట్ పూర్తిగా రసాయనంతో తయారు చేయబడింద‌ని చెబుతారు.అలాగే రెడ్ మార్క్ అంటే నేచురల్, కెమికల్‌ తో చేసిన టూత్ పేస్ట్ అని, బ్లూ కలర్ మార్క్ ఉంటే నేచురల్, మెడిసిన్‌తో చేసిన టూత్ పేస్ట్ అని, గ్రీన్ అంటే పూర్తిగా నేచురల్ అని చెబుతారు.

దాంతో  కొంద‌రు టూత్ పేస్ట్ నాణ్యతను గుర్తించ‌డానికి రంగును ప్రమాణంగా పరిగణిస్తున్నారు.అయితే దీనిలో నిజం లేద‌ని కోల్‌గేట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం చెబుతోంది.

Advertisement
What Is The Meaning Of Mark On Toothpaste Secret Knowledge Red Green Blue Detail

ఈ గుర్తుకు నాణ్యతతో సంబంధం లేద‌ని.

What Is The Meaning Of Mark On Toothpaste Secret Knowledge Red Green Blue Detail

ఇది టూత్‌పేస్ట్ ట్యూబ్‌ను ఇక్కడ నుండి కత్తిరించి ట్యూబ్‌కు సీలు వేయాలని చూపిస్తుంద‌ని తెలియ‌జేస్తుంది.దీనికి నాణ్యతతో సంబంధం లేద‌ని కోల్‌గేట్ తెలిపింది.అయితే టూత్‌పేస్ట్‌లో ఏమి కలుపుతారు? ఎలా తయారు చేస్తారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు టూత్‌పేస్ట్ ట్యూబ్‌పైనున్న స‌మ‌చారాన్ని చూడ‌వచ్చు.

Advertisement
" autoplay>

తాజా వార్తలు