మౌనం అర్ధాంగికారమేనా మోడీజీ?

మణిపూర్ మంటలు పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తున్నాయి.

ముఖ్యంగా మణిపూర్ రాష్ట్ర అధికార బిజెపి వైఫల్యం పై కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిన విషయమే .

అయితే ప్రతిపక్షాల నిరసనలపై కానీ దేశవ్యాప్తంగా రగులుతున్న ఆందోళనపై కానీ ప్రధానమంత్రి ఇప్పటివరకు స్పష్టంగా ప్రకటన చేయకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది .అయితే ప్రధానమంత్రి ఈ ఒక్క విషయంలోనే మౌనంగా లేరని దేశవ్యాప్తంగా సంచలమైన అనేక విషయాలలో ప్రధాని మౌనాన్ని ఆశ్రయించారని కూడా రాజకీయ పరిశీలన విశ్లేషిస్తున్నారు.ముఖ్యంగా దేశానికి ఒలంపిక్ పథకాలు అందించిన రెజ్లర్ ల( Wrestlers ) విషయంలో కొన్ని నెలలుగా ఆందోళన చేసినా కూడా ఎక్కడా వారి ఆందోళనను అడ్రస్ చేస్తూ ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలేదు.

అంతేకాకుండా రైతు చట్టాల విషయంలో భారీ ఎత్తున ఆందోళన జరిగినప్పుడు కూడా రైతుల ఆందోళనను తగ్గించే విధంగా ప్రధాని ఏ విధమైన ప్రకటన చేయలేదు.పైగా ఆందోళనలో విదేశీ శక్తుల హస్తం ఉందంటూ కూడా బిజెపి నేతలు తిరుగుదాడి చేశారు.అంతేకాకుండా గత పార్లమెంటు సమావేశాల్లో రెండు సభలను కుదిపేసినఅడాని మోదీ( Narendra Modi ) సంబంధాలపై విపక్షాల ప్రశ్నలకు కూడా మోడీ సమాధానం ఇవ్వలేదు.

నిజానికి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల పని అందులో నిజా నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.ప్రబుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని నిరూపించుకోవాల్సిన బాధ్యత పాలకులదే కదా.అయినా కూడా ప్రజల అనుమానాలు కానీ ప్రతిపక్షాలు ఆరోపణలు కానీ మాకు సంబంధం లేదని తప్పించుకోవడం ప్రజాస్వామ్యంలో హర్షణీయం కాదు .

Advertisement

సాధారణ ప్రజలకు కూడాఅనేక అనుమానాలు,ఆగ్రహం ఉన్నచోట ప్రభుత్వం చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తుందన్న ప్రకటన గాని కనీసం అందుకు ఆధారాలు గాని చూపించాల్సి ఉంటుంది.మరి ప్రతి సమస్యకు మౌనాన్ని సమాదా నంగా చూపిస్తున్న ప్రధాని గత కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్( Manmohan Singh ) ను అనుసరిస్తున్నట్లుగానే ఉంది.మరి వారికి అందిన ఫలితాలే వీరికి కూడా రిపీట్ అయితే కానీ తత్వం బోధపడేలా లేదు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు