మంగళ సూత్రంలో ఇవి ధరిస్తే స్త్రీ జీవితంలో ఆనందానికి అవధులు ఉండవు

హిందూ వివాహాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం మాంగళ్య ధారణ అనేది చాలా ముఖ్యమైన తంతు అని చెప్పవచ్చు.

మన భారతీయ సంప్రదాయంలో వివాహం అయినప్పటి నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించటం అనేది చాలా ముఖ్యమైనది.

ప్రతి మహిళ తన మాంగల్యానికి ప్రత్యక ప్రాధాన్యతను ఇస్తుంది.స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవటానికి చేయని పూజలు ఉండవు.

What Is The Importance Of Mangalsutra-What Is The Importance Of Mangalsutra-Devo

అలాగే వ్రతాలూ,నోములు,ఉపవాసాలు చేస్తూ ఉంటారు.మన సంప్రదాయంలో మంగళ సూత్రాలలో ముత్యం,పగడం గుచ్చుకుంటారు.

మంగళ సూత్రాలలో ముత్యం,పగడం ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు.అసలు పగడం,ముత్యం ధరించటం వలన ఏమి జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం.

Advertisement

ముత్యం, పగడం ధరించటం అనేది కేవలం అలంకారం కోసం కాదు.స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయని పండితులు అంటున్నారు.

పగడం కుజుడు, సూర్యునికి ప్రతీకలు.పగడం స్త్రీ శరీరానికి అవసరమయ్యే ఉత్తేజాన్ని ఇస్తుంది.

నాడి మండలాన్ని ఉత్తేజితం చేస్తుంది.ముత్యం చంద్రునికి ప్రతీకగా చెప్పుతారు.అందం, మనసు ప్రశాంతత, ముఖ్యంగా అన్యోన్య దాంపత్యంనకు కారకుడు చంద్రుడు.ముత్యం శరీరంలో వేడిని తగ్గించి ప్రశాంతత,సహనం,సౌభాగ్యాన్ని కలిగిస్తుంది.

ముత్యం,పగడం రెండు సూర్య చంద్రుల కాంతులను నిక్షిప్తం చేస్తాయి.కుజుడు,చంద్రుడు గ్రహాలు స్త్రీల ఆరోగ్యం నకు సహాయపడతాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ప్రతి స్త్రీ జీవితంలో సూర్యుడు,చంద్రుడు,కుజుడు గ్రహ స్థితులు బాగుంటే వారి జీవితం ఆనంద మాయం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు