ప్రభాస్ రాజాసాబ్ పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఆయన కల్కి సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ తన తదుపరి రాబోయే చిత్రాల మీద కూడా అభిమానులు చాలా ఆసక్తి కరంగా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ఆ సినిమాలు కూడా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించి రికార్డులను కొల్లగొట్టాలనే విధంగా ప్రణాళికలు రూపొందించుకొని దర్శక నిర్మాతలు ముందుకు తీసుకొస్తున్నారు.

ఇక అందులో మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా( The Raja Saab ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమా రాణిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే మారుతి తీస్తున్న రాజాసాబ్ మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు.

మరి ఆ సినిమా ఆశించిన మేరకు విజయం సాధిస్తే మారుతి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.లేకపోతే మాత్రం ఆయన మళ్లీ మీడియం రేంజ్ డైరెక్టర్ గానే కొనసాగాల్సిన అవసరం అయితే ఉంది.

Advertisement

కాబట్టి ఆ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధించి ముందుకు దూసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటిదాకా ప్రభాస్( Prabhas ) చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది.కమర్షియల్ సినిమాగా వస్తున్న ఇది మంచి విజయాన్ని సాధించడమే కాకుండా రికార్డులను కూడా కొల్లగొడుతుంది అంటూ సినిమా యూనిట్ మంచి ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక మొత్తానికైతే ప్రభాస్ వచ్చే సినిమాలతో కూడా మంచి విజయాన్ని సాధిస్తే ఇక ఆయనను మించిన స్టార్ హీరో ఇండియాలోనే మరొకరు ఉండరు.

అలాగే రెమ్యూనరేషన్ విషయాల్లో కూడా ఆయననే టాప్ పొజిషన్ కి కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు