పవన్ ఆగుతున్నాడా.. ఆపుతున్నారా ?

ఏపీలో టిడిపి జనసేన పొత్తులకు సంబంధించిన చర్చ ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.

ఈ రెండు పార్టీల మద్య పొత్తు ఖాయమని అటు అధికార వైపీసీ కూడా ఫిక్స్ అయిపోయింది.

ఇటు ప్రజలు కూడా ఓ అంచనాకు వాచ్చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు పార్టీలు కూడా పరోక్షంగా చాలాసార్లు హింట్ ఇచ్చాయి కూడా.

దీంతో పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటనే తరువాయి అనే అని భావిచారంతా.అయితే ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే అంచనాలు తారుమారవుతున్నాయా ? ఈ రెండు పార్టీల మద్య పొత్తు కుదిరే అవకాశం లేదా ? టీడీపీతో కలిసేందుకు పవన్ వెనుకడుగు వేస్తున్నారా ? అనే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వైసీపీ( YSRCP ) వ్యతిరేక ఓటు చిలనిచ్చేది లేదని ఆదుకోసం ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్దమే అని చెప్పిన పవన్( Pawan kalyan ) ఇప్పుడు టీడీపీతో కలిసేందుకు సంకోచిస్తున్నారట.

అందుకు కారణం బీజేపీనే అనే చర్చ జరుగుతోంది.

Advertisement

మొదటి నుంచి కూడా జనసేన బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి వెళ్తామని కమలనాథులు పదే పదే చెబుతున్నారు.మరోవైపు పవన్ కూడా ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పకపోయినప్పటికి పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు.

దీన్ని బట్టి జనసేన బీజేపీ దోస్తీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే జనసేనకు బీజేపీ బలం ఏమాత్రం సరిపోదు.

అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ ఉవ్విళ్లూరుతున్నారు.అయితే బీజేపీ, టీడీపీ మద్య సత్సంబంధాలు లేవు.

దాంతో ఈ రెండు పార్టీల మద్యన ఉన్న జనసేన ఎటు వైపు వెళ్లాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.కాగా టీడీపీ, బీజేపీని కలిపితే జనసేన లక్ష్యం సులువౌతుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలను కలపాలని పవన్ మొదటినుంచి కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.అయితే బీజేపీతో కలిసేందుకు టీడీపీ సుముఖంగానే ఉన్నప్పటికి టీడీపీతో కలిసేందుకు బీజేపీ సుముఖత చూపడంలేదు.ఇక డిల్లీ పెద్దలతో కలిసిన పవన్ టీడీపీతో కలవాలని సూచించారట.

Advertisement

దానికి బీజేపీ( BJP ) పెద్దల నుంచి సరైన స్పందన రాలేదని వినికిడి.

ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే పవన్ టీడీపీతో వెళితే.జనసేన పొత్తును క్యాన్సిల్ చేసుకునేందుకు కూడా బీజేపీ పెద్దలు సిద్దంగా ఉన్నారట.దాంతో పవన్ ఎటు తేల్చుకోలేక సందిగ్ధంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది.

అయితే పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా బీజేపీ పెద్దలు మైండ్ గేమ్ ఆడినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.మొత్తానికి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జనసేన టీడీపీ పొత్తు అడ్డుకోవడంలో బీజేపీ సక్సస్ అయిందనే చెప్పాలి.

మరి రాబోయే రోజుల్లో పవన్ బీజేపీతోనే ఉంటారా ? లేదా టీడీపీ వైపు వెళ్తారా ? లేక రెండు పార్టీలను కలిపి కూటమి ఏర్పాటు చేస్తారా ? అనేది చూడాలి.

తాజా వార్తలు