థైరాయిడ్ పేషెంట్లు నిమ్మ‌కాయ తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో చాలా మందిని థైరాయిడ్ స‌మ‌స్య వేధిస్తోంది.థైరాయిడ్‌లోనే హైపోథైరాయిడ్‌, హైప‌ర్‌థైరాయిడ్ ఇలా రెండు ర‌కాలు ఉన్న‌ప్ప‌టికీ.

ఎక్కువ శాతం మంది హైపోథైరాయిడ్‌తోనే బాధ ప‌డుతుంటారు.శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్లు కావలసిన దానికంటే తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వ‌ల్ల‌ హైపోథైరాయిడ్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

ముఖ్యంగా ఆడ‌వారిలో ఈ థైరాయిడ్ స‌మ‌స్య ఎక్కువుగా క‌నిపిస్తుంది.ఇక ఒక్క‌సారి థైరాయిడ్ వ‌చ్చిందంటే.

జీవిత కాలం ముందులు మింగుతూనే ఉండాలి.పైగా ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Advertisement
What Happens If Eat Lemon When Thyroid! Eat Lemon, Thyroid, Thyroid Patients, La

అందుకే థైరాయిడ్ అంటేనే భ‌య‌ప‌డిపోతుంటారు.అయితే థైరాయిడ్ వ్యాధితో బాధ ప‌డే వారికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి.

అలాంటి వాటిలో నిమ్మ‌కాయ ఒక‌టి.సాధార‌ణంగా థైరాయిడ్ ఉన్న వారిలో ఒత్తిడి, నీర‌సం, మైకం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి.

What Happens If Eat Lemon When Thyroid Eat Lemon, Thyroid, Thyroid Patients, La

అయితే అనేక పోష‌కాలు నిండి ఉండే నిమ్మ కాయ‌ను ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో తీసుకుంటే.త‌ర‌చూ నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.ఒత్తిడి, మైకం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే థైరాయిడ్ వ్యాధి వ‌చ్చిన‌ప్పుడు కొంద‌రు ఉన్న‌ట్టు ఉండి బ‌రువు పెరిగిపోతుంటారు.అయితే ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక స్పూన్ నిమ్మ ర‌సం మ‌రియు ఒక స్పూన్ తేనె క‌లిపి సేవించాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

లేదంటే గ్రీన్ టీలో లెమ‌న్ జ్యూస్ ఎడ్ చేసుకుని కూడా తాగొచ్చు.ఇలా ఎలా చేసినా బ‌రువు అదుపులో ఉంటుంది.

Advertisement

ఇక థైరాయిడ్ ఉన్న వారిలో జుట్టు రాలుట, చర్మం పొడిబారటం వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి.అయితే నిమ్మ‌కాయను ప్ర‌తి రోజు ఏదో ఒక విధంగా తీసుకుంటే.

జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.మ‌రియు చ‌ర్మం పొడిబార‌టం త‌గ్గి.

ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉంటుంది.నిమ్మ‌కాయ మంచిదే అయిన‌ప్ప‌టికీ.

అతిగా మాత్రం తీసుకోరాదు.అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి.

తాజా వార్తలు