నేచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా కీర్తి సురేశ్( Keerthy Suresh ) హీరోయిన్ గనటించిన దసరా మూవీ ( Dasara movie )మార్చి 30న విడుదల అయి రెండు తెలుగు రాష్ట్రాలలో దుమ్ముదులిపే కలెక్షన్లు రాబడుతోంది.
మొదటి రోజునే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా ఈ మూవీ ఐదు రోజుల్లోనే 92 కోట్ల గ్రాస్ సాధించి సంచలన విజయంగా దూసుకుపోతుంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ రా అండ్ రాస్టిక్ మూవీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పెడుతున్నారు.అయితే తెలుగు సంగతి అలా ఉంచితే మిగిలిన భాషల్లో దసరా సంగతేంటి అనేదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్నా చర్చ.
దసరా పై మొదటి నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నాని నార్త్ లో కూడా భారీగానే ప్రమోషన్స్ చేశారు.కేజిఎఫ్, ఆర్ ఆర్ ఆర్, తరువాత ఆ స్థాయిలో గురించుకొదగ్గ సినిమా అని ఒక్కసారిగా నార్త్ లో కూడా రిలీజ్ కు ముందు హైప్ క్రియేట్ చేశారు నాని.అయితే రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి.
ముఖ్యంగా నార్త్ లో దసరా ఆశించిన స్థాయిలో వసూళ్లను అందుకోవడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇక కన్నడ, తమిళ్, మలయాళం వంటి భాషల్లో కూడా దసరా డీలా పడిపోయింది.
రొటీన్ కథ కు కాస్త విలేజ్ బ్యాక్ డ్రాప్ జతచేయడంతో మూవీ పై పెదవి విరుస్తున్నారు ఇతర భాషల సినీ ప్రియులు.అయితే ముఖ్యంగా హిందీ మార్కెట్ పై భారీగానే హోప్స్ పెట్టుకున్న నానికి అజయ్ దేవగన్ భోళా మూవీ బ్రేకులు వేసింది.
దసరా రోజునే భోళా కూడా విడుదల కావడం.అజయ్ దేవగన్ హిందీ స్టార్ హీరో కావడంతో దసరా మూవీపై భారీగానే ఎఫెక్ట్ పడింది.అయితే నానికి నార్త్ లో పెద్దగా ఇమేజ్ లేదు అయినప్పటికి కాస్త ఒకే అనిపించే విధంగానే కలెక్షన్లు వస్తుండడంతో నార్త్ లో కూడా దసరా హిట్టే అని కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఆర్ ఆర్ ఆర్, కేజిఎఫ్, పుష్ప వంటి సినిమాల రేంజ్ హిట్ ఆశించిన నానికి ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే.మొత్తానికి దసరా మూవీతో నాని నార్త్ పై పెట్టుకున్న ఆశలు ఏ మాత్రం ఫలించలేదనే చెప్పాలి.
మరి నాని తరువాతి సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతాయో లేదో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy