ఖాళీగా ఉన్న రోటిలో రుబ్బరాదా.. రుబ్బితే ఏం అవుతుంది?

రుబ్బురోలు, రోటి గురించి ఇప్పటి కాలంలోని చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ పాత కాలంలోని వాళ్లందరికీ దీని గురించి చాలా బాగా తెలుసు.

ఎలాంటి పచ్చడి చేయాలన్నా.ఏ పిండి రుబ్బాలున్నా అందరూ రుబ్బురోలునే వాడే వాళ్లు.

కానీ మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక వాటి వాడకం చాలా వరకు తగ్గిపోయింది.అయితే పల్లెటూళ్లలోని చాలా మంది ప్రజలు ఇప్పటికీ రోళ్లను వాడుతున్నారు.

కావలసినవన్నీ రోటిలో వేసి రోకలితో చక్కగా దంచుకుంటున్నారు.అయితే ఖాళీగా ఉన్న రోటిలో మాత్రం రుబ్బకూడదని పెద్దలు చెబుతుంటారు.

Advertisement
What Happens On An Empty Roll Details, Empty Roll, Roti, Grinding Stone, Rubburo

అయితే అది నిజమేనా, అసలు ఖాళీగా  ఉన్న రోటిలో ఎందుకు రుబ్బకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.రోటికి, పొత్తర మునకు మధ్యలో కాస్త కరుకుగా ఉండేది.

దీనినే కక్కు అంటారు.ఈ కక్కు లేకుండా నునుపుగా ఉంటే ఏ పదార్థమైనా త్వరగా నలగదు కదా.ఖాళీ రోలును వాడటం అంటే రుబ్బడం వలల్ రాతిరోలుకు ఉన్న గరుకుతనం అరిగిపోయి, ధాన్యాన్ని దంచటం లేదా రుబ్బటం ఆలస్యం అవుతుంది.

What Happens On An Empty Roll Details, Empty Roll, Roti, Grinding Stone, Rubburo

ఆ కారణంగానే ఖాళీగా ఉన్న రోలును రుబ్బకూడదు అన్న నిషేధాన్ని పెట్టడం జరిగింది.రోలు గరుకుగా ఉంటేనే త్వరగా దానిలో వేసిన పదార్థాన్ని మెత్తగా నూరివేయ గల్గుతుంది.అది మాత్రమే కాక ఖాళీ రుబ్బురోలు తిప్పితే భయంకరమైన శబ్దం వస్తుంది.

ఈ శబ్దం చుట్టు పక్కల వారికి చాలా ఇబ్బంది కల్గజేస్తుంది.అందుకే ఇటువంటి పనులు చేయకూడదని నిషేధం విధించారు మన పెద్దలు.

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు