కీర‌దోసను తొక్కతో పాటు తినొచ్చా..? ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా వినియోగించే కూర‌గాయ‌ల్లో కీర‌దోస ఒక‌టి.

దీనిలో వాట‌ర్ కంటెంట్‌తో పాటు కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ కె, ప్రోటీన్‌, ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా కీరదోస అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంటుంది.చ‌ర్మ సౌంద‌ర్యానికి, జుట్టు సంర‌క్ష‌ణ‌కు సైతం కీర‌దోస‌ను ఉప‌యోగిస్తుంటారు.

అయితే కీర‌దోస‌ను కొంద‌రు తొక్క‌తో పాటే తీసుకుంటారు, మ‌రికొంద‌రు తొక్క‌ను తొల‌గించి తీసుకుంటారు.అస‌లు ఎలా తీసుకుంటే మంచిది.? తొక్క‌తోనా.? లేక తొక్క‌ను తొల‌గించా.? అంటే పోష‌కాహార‌ నిపుణులు మాత్రం కీర‌దోస‌ను తొక్క‌తో పాటు తింటేనే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయ‌ని అంటున్నారు.మ‌రి ఇంత‌కీ ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

త‌ర‌చూ జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడేవారు కీర‌దోస‌ను తొక్క‌తో పాటు తీసుకుంటే చాలా మంచిది.తొక్క తొల‌గించ‌ని కీర‌దోస‌లో పుష్క‌లంగా ఉండే ఫైబ‌ర్ కంటెంట్ జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును చురుగ్గా మార్చుతుంది.

Advertisement
What Happen If Eat Cucumber With Peel? Cucumber, Cucumber With Peel, Latest News

దాంతో గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే మ‌న శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ కె ఒక‌టి.

ఇది తొక్క తీసిన కీర‌దోస‌లో కంటే తొక్క తీయ‌ని కీర‌దోస‌లోనే అధికంగా ఉంటుంది.

What Happen If Eat Cucumber With Peel Cucumber, Cucumber With Peel, Latest News

అందువ‌ల్ల‌, కీరదోస‌ను తొక్క‌తో పాటే తింటే శ‌రీరానికి విట‌మిన్ కె స‌మృద్ధిగా అందుతుంది.దాంతో ఎముకలకు, కండరాలకు తగినంత బలం చేకూరుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

అంతేకాదు, తొక్క‌తో పాటుగానే కీర‌దోస‌ను తీసుకుంటే చ‌క్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.మ‌రియు చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ నిగారింపుగా కూడా మెరుస్తుంది.

Advertisement

కాబ‌ట్టి, ఇక‌పై వీలైనంత వ‌ర‌కు కీర‌దోస‌ను తొక్క తొల‌గించ‌కుండా తీసుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

తాజా వార్తలు