కోరుకున్నవి దక్కాలంటే ఈ అయిదూ చేయాలి?

కోరుకున్న కోరికలు తీరాలన్నా, చేపట్టాలనుకున్న పని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావాలన్నా ఈ అయిదు పనులు చేస్తే చాలంటూన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

 అంతే కాదండోయ్ ఇవి చేస్తే.

 మనం ఎప్పుడూ సుఖ సంతోషాలతో హాయిగా ఉంటామని కూడా వివరిస్తున్నారు. లోక కళ్యాణం కోసం చేసే మహాకార్యాలను యజ్ఞం అంటారు.

 ఈ యజ్ఞం చేయడం వల్ల మనమే కాదు మనతో పాటు ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారంట. యజ్ఞం మొత్తం ఆదు రకాలని వేదాలు చెబుతున్నాయి.

అందులో మొదటిది దైవ యజ్ఞం. దేవతల తృప్తి కోసం అగ్ని హోత్రంలో హోమ ద్రవ్యాలు వేసి హోమం చేస్తారు. ఇలా చేసే హోమం పొగ పీల్చుకున్నా.

Advertisement
What Do You Need To Do To Get What You Want, Devotional , Yagnam , Pooja, Agno H

 బూడిదని బొట్టుగా ధరించిన మనలో ఉన్న భయాలన్నీ పోయి మనశ్శాంతిగా ఉంటామట. రెండోది పితృ యజ్ఞం.

 మరణించిన పెద్దలకు తర్పణాదులు ఇచ్చి వారి ప్రీత్యర్థం ప్రాణులకు ఆహారం ఇవ్వడం. ఇలా ఇవ్వడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి కల్గుతుందట.

 అంతే కాదండోయ్. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కూడా దీవిస్తాయట.

What Do You Need To Do To Get What You Want, Devotional , Yagnam , Pooja, Agno H

మూడోది భూత యజ్ఞం. ఇంట్లో నిత్యపూజ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో ప్రాణుల కోసం ఆహారాన్ని ఉంచడం. ఇలా ఉంచడం వల్ల చీమలు, చిన్న చిన్న కీటకాలకు, పక్షుల కడుపు నింపినవాళ్లమవుతాం,.

అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

 ఆకలితో ఉన్న వారి కడుపు నింపితే. మనకు ఎంతో మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Advertisement

 నాలుగోది మనుష్య యజ్ఞం. శక్తి కొద్దీ అతిథులకు అన్నం పెట్టడం.

 ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి వారిని బాగా చూసుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి. మన పెద్దలు అతిథి దేవో భవ అన్నారు.

 ఇంటి కొచ్చిన వారు దేవుళ్లతో సమానమని దేవుడికి సేవ చేసినట్టుగానే వారికి కూడా చేయాలంటారు. అలా చేస్తే మనకు ఎంతో పుణ్యం లభిస్తుందట.

 ఐదోది బ్రహ్మ యజ్ఞం. వేదాలతో కొంత భాగాన్ని శక్తి కొద్దీ నిత్యాభ్యాసం చేయడం.

 ఇలా చేయడం కూడా చాలా మంచిదట.

తాజా వార్తలు