ఒక్క కూల్ డ్రింక్ మీ శరీరంలో ఏం చేస్తుందో తెలుసా?

వస్తున్నది వేసవికాలం.భగభగలాడే భానుడి దెబ్బకి, రోజంతా దాహం వేస్తూనే ఉంటుంది.

దాహం తీర్చుకోవడానికి మంచి నీళ్ళు తాగితే మంచిది.

కొబ్బరినీళ్ళు తాగితే మంచిది, నిమ్మరసం, ఇంకేదైనా పండ్లరసం తాగినా మంచిదే.

కాని జనాలు చేసే తప్పు, కూల్ డ్రింక్స్ మీద ఇష్టం పెంచుకోవడం.అసలు ఓ కూల్ డ్రింక్ మీ శరీరంలోకి వెళ్ళాక ఏం చేస్తుందో తెలుసా ? * కూల్ డ్రింక్స్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువే అని చదువుకున్నాం.ఈ హై షుగర్ లెవెల్స్ శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ ని పెంచి బ్లడ్ ప్రెషర్ ని, కోలెస్టిరాల్ లెవెల్స్ ని పెంచుతుంది.

డయాబెటిస్, అధిక బరువు సమస్యలు వస్తాయి.* షుగర్స్ కి బదులుగా అస్పర్టమే అనే కెమికల్ ని కూడా వాడుతుంటారు కూల్ డ్రింక్స్ లో.ఇది శరీరంలో పెరిగినా కొద్ది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.అంతేకాదు, పుట్టబోయే బిడ్డ ఏదైన అవలక్షణంతో పుట్టవచ్చు.

Advertisement

* కూల్ డ్రింక్స్ లో ఉండే ఫాస్ ఫెరిక్ ఆసిడ్ శరీరం కాల్షియం గ్రహించే శక్తిని తగ్గిస్తుంది.దాంతో ఎముకలు బలహీనపడటం, దంతాల్లో సమస్యలు వస్తాయి.

* సోడియం బెన్జోయేట్ అనే కెమికల్ కూడా కూల్ డ్రింక్స్ లో ఉంటుంది.కడుపులో ఈ కెమికల్ వలన జరిగే రియాక్షన్స్ వలన క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది.

* ఓ కూల్ డ్రింక్ తాగితే ఓ కాఫీ తాగినట్టే.కాఫీ ఇంటేక్ లిమిటెడ్ గా ఉండాలన్న విషయం తెలిసిందే.

ఇక కాఫీ తాగి, మళ్ళీ కూల్ డ్రింక్స్ కూడా లాగిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించండి.అధిక కెఫైన్ వలన గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

Advertisement

తాజా వార్తలు