సంక్షేమ రాజ్యం సీఎం కేసీఆర్తోనే సాధ్యం

సంక్షేమ రాజ్యం కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే సాధ్యమని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఖమ్మం జిల్లా చింతకాని సొసైటీ డైరెక్టర్ నన్నక కోటయ్య అన్నారు.

ఇటీవల నూతనంగా ప్రభుత్వం మంజూరి చేసిన ఆసరా పించన్ల పంపిణీ కార్యక్రమం గురువారం నేరడ గ్రామంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం టీఆర్ఎస్ నాయకులు నన్నక కోటయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రకాల సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని అన్నారు.దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా రైతులకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, యువకులకు, ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్టు తెలిపారు.

ఆసరా పించన్లను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని నన్నక కోటయ్య అకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్రెముచ్చు ఈశ్వరమ్మ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మట్టా చిన్న సైదా, 1వ వార్డు సభ్యులు ఎస్ కే సుభాని, పంచాయతీ కార్యదర్శి బత్తుల సీత, గ్రామపెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling
Advertisement