Balineni Srinivasa Reddy : పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించం..: బాలినేని

వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి( Balineni Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

పేదలకు అన్యాయం చేయాలని చూస్తే సహించమని పేర్కొన్నారు.

సీఎం జగన్( CM Jagan ) ఆదేశాలతో ఒంగోలులో భూములు తీసుకున్నామని తెలిపారు.మళ్లీ పట్టాల పంపిణీ ఆపాలని మరోసారి కోర్టులో పిల్ వేశారని పేర్కొన్నారు.

పట్టాలు ఇవ్వకూడదని ఇలాంటి పనులు చేస్తే ప్రజలు చీదరించుకుంటారని వెల్లడించారు.ఒంగోలులో( Ongole ) పట్టాలు ఇవ్వకుంటే పోటీ చేయనని చెప్పినట్లు తెలిపారు.

అర్హులైన పేదలను అధికారులే పారదర్శకంగా ఎంపిక చేశారన్న బాలినేని అర్హులైన టీడీపీ( TDP ) వాళ్లకు కూడా పట్టాలు ఇస్తామని తెలిపారు.భూముల కొనుగోలుకు ఎకరాకు రూ.8 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తున్నారని, తనపై ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.ఈ క్రమంలోనే ఎవరెన్ని కుట్రలు చేసినా ఇళ్ల పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు