ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ ను కలుస్తాం..: ఎంపీ లక్ష్మణ్

బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే డ్రామాలాడుతున్నాయని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ అంశం( Phone Tapping Issue ) దేశ భద్రత, వ్యక్తిగత భద్రతకు సంబంధించినదని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అంశం కాబట్టి కేంద్రం కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్ ను కలుస్తామని వెల్లడించారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide