మేము మనుషులమే... కాస్త ప్రైవసీ ఇవ్వండి ఓ రేంజ్ లో ఫైర్ అయిన అలియా భట్!

సాధారణంగా అభిమానులు సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుత కనపరుస్తుంటారు.అయితే ఇలా సినిమాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో తప్పులేదు.

కానీ కొంతమంది మాత్రం వారి లిమిట్స్ క్రాస్ చేసి వారి వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూస్తూ వారి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత విషయాలను కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతో మంది సెలబ్రిటీలు ఫోటోగ్రాఫర్లు, మీడియా వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నటి అలియా భట్ తన ఇంట్లో లివింగ్ రూమ్ లో ఏదో పనులు చేస్తూ ఉండగా కొందరు ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రర్స్ నుంచి ఆమెను ఫోకస్ చేశారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా నటి అలియా భట్ ఈ వ్యవహారం పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విధంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని కూడా పబ్లిక్ లో పెట్టడంతో ఎంతోమంది మేము కూడా మనుషులమే కదా మాకంటూ కొంచెం ప్రైవసీ కావాలి అంటూ ఫోటోగ్రాఫర్ల వ్యవహార శైలి పై మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆలియా భట్ ఫోటోగ్రాఫర్ల పై మండిపడుతూ ఆటలాడుకుంటున్నారా నేను నా ఇంట్లో మధ్యాహ్నం లివింగ్ రూమ్ లో ఉండగా కొందరు ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ పైనుంచి ఫోటోగ్రాఫర్లు కెమెరాలను నా వైపు పెట్టడం గమనించాను.ఎక్కడైనా ఇలాంటివి ఎవరైనా ఆమోదిస్తారా ఇది పూర్తిగా ఒకరి ప్రైవసీని కాలరాయడమే.ఫోటోగ్రాఫర్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

Advertisement

అయితే ఈ పోస్ట్ పై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతున్నారు.ఇలా తమకు కూడా గతంలో ఎన్నో చేదు సంఘటనలు ఎదురయ్యాయి అంటూ అలియాకు మరికొందరు బాలీవుడ్ నటీమణులు మద్దతు తెలియజేశారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు