కవితను అందుకే అరెస్ట్ చేయలేదా ? 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( kalvakuntla kavitha ) అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే ఈ కేసులో ఈడి అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనిష్ సిసోడియా( Manish Sisodia 0 ను అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని అరెస్టులు చేశారు.ప్రస్తుతం ఈ కేసులో కవితను మూడు దఫాలుగా ఈడి అధికారులు విచారించారు.

ప్రాథమిక సాక్షాలు అన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాతనే కవితను ఈడి అధికారులు విచారణకు పిలవడంతో,  ఈ విచారణ సమయంలోనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా  ప్రచారం జరిగింది.దీనికి తగ్గట్లుగానే మంత్రి కేటీఆర్ , హరీష్ రావు తో పాటు , అనేకమంది మంత్రులు, పార్టీ కీలక నేతలు ఎంతోమంది ఢిల్లీలోని మకాం వేశారు.

చివరకు నిన్న ఈడి అధికారులు కవితను విచారించి వదిలిపెట్టేయడంతో,  ఇప్పటి వరకు కవితని అరెస్ట్ చేస్తారు అనే ఉత్కంఠతో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు రిలాక్స్ అయ్యాయి.

Advertisement

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించింది.పైకి శత్రువులా కనిపిస్తున్నా., బీజేపీ బీఆర్ఎస్ లు ఒకటేనని, ఈ కేసులో కవితను బిజెపిని కాపాడుతోందని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు.

బీఆర్ఎస్ కు బిజెపి అండదండలు ఉన్నాయి కాబట్టే.ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మనీష్ సిసోడియా ను అరెస్ట్ చేసి కవితను అరెస్ట్ చేయలేదని మధు యాష్కీ( Madhu Goud Yaskhi ) విమర్శించారు.

అంతేకాదు ఆదాని వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బిజెపి ఈ లిక్కర్ స్కాం వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి స్పీడ్ పెంచిందని , ఢిల్లీలో  కవితను  ఈడి అధికారులు విచారిస్తున్న వ్యవహారం పైనే ప్రజల దృష్టి పడే విధంగా బిజెపి ఈ విధంగా ప్లాన్ చేసిందని మధు యాష్కీ విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణాతో వేలకోట్లు అర్జించిన కల్వకుంట్ల కుటుంబం , ఇప్పుడు మద్యం మాఫియా లోనూ ఎంట్రీ ఇచ్చిందని , కేసిఆర్ ఆయన కొడుకు,  మొత్తం పార్టీకి, ప్రభుత్వానికి ఇప్పుడు కవిత వ్యవహారమే ప్రధాన సమస్యగా మారిందని,  అందుకే తెలంగాణలో పాలను పూర్తిగా పక్కన పెట్టి లిక్కర్ స్కాం వ్యవహారంలో ఇరుక్కున్న కవితను కాపాడేందుకు తెలంగాణ క్యాబినెట్ ఢిల్లీలోనే కూర్చుంది అని మధు యాష్కీ మండిపడ్డారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు