చందమామ మీద కాలు పెట్టాలని ఉందా..?! అయితే ఇలా ఫాలో అయిపోండి..!

చిన్నపిల్లలకు చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తుంటారు.ఇక చాల మంది మెడపై పడుకొని చందమామను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

ఇక జాబిలమ్మ దగ్గరికే పోయే వస్తే అందరు ఒక్కసారిగా గాలిలో తేలిపోతుంటారు.తాజాగా జపాన్‌కి చెందిన బిలియనీర్ యుసాకు మాజెవా మంగళవారం ఓ సంచలన ప్రకటన చేశారు.

Want To Set Foot On The Moon But Follow Like This , Moon Trip, Flight Map, Viral

తనతోపాటూ చందమామ దగ్గరకు వెళ్లేందుకు 8 మందిని ఎంపిక చేసుకుంటానని తెలిపారు.ఈ ట్రిప్ 2023లో ఉంటుంది.

ప్రైవేట్ రోదసీ సంస్థ స్పేస్‌ఎక్స్‌కి చెందిన స్టార్‌షిప్‌లో ఈ టూర్ ఉంటుంది.ఓ వీడియో రిలీజ్ చేసిన యుసాకూ.

Advertisement

"నేను ఆహ్వానిస్తున్నాను.నాతోపాటూ.

ఈ చందమామ మిషన్‌లో చేరండి" అని కోరారు.అయితే 2018 సెప్టెంబర్‌లో స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత ఎలన్ మస్క్‌తో కలిసి ఈ మూన్ మిషన్ ప్రకటించారు.

చందమామ చుట్టూ తిరిగేలా మిషన్ ఉంటుందని చెప్పారు.ఈ ప్రాజెక్టు పేరు డియర్ మూన్.

ఇందులో మొత్తం 10 నుంచి 12 ఉంటారు.వారిలో 8 మందిని ప్రజల నుంచి ఎంపిక చేస్తారు.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

ఇక వారి ఖర్చులన్నీ వాళ్లే భరిస్తాని తెలిపారు.ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా.

Advertisement

చందమామ చెంతకు వెళ్లేందుకు 3 రోజులు పడుతుంది.ఆ తర్వాత చందమామ చుట్టూ తిరిగేలా కక్ష్యలోకి రాకెట్ వెళ్తుంది.

అలా జర్నీ పూర్తయ్యాక మళ్లీ మూడ్రోజుల పాటూ ప్రయాణించి భూమికి వస్తారు.ఇది మొదటి ప్రైవేట్ ల్యూనార్ మిషన్.

ఈ మిషన్‌లో రాకెట్ ఒకప్పటి అపోలో మిషన్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.అయితే ఈ ప్రాజెక్టులో చేరాలనుకునేవారు డియర్ మూన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది.

మార్చి 14 వరకూ ఈ ఛాన్స్ ఉంది.అభ్యర్థులు తమ పేరు, దేశం పేరు, ఈమెయిల్ అడ్రెస్, ఫొటోను ఇవ్వాలి.

మార్చి 21 నుంచి స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుంది.ఫైనల్ ఇంటర్వ్యూ, మెడికల్ చెకప్ మేలో జరుగుతాయి.

వెళ్లానుకునేవారు అంతరిక్షంలో ఏం చెయ్యాలనుకుంటున్నారో ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది.అలాగే తమలా వచ్చే వారికి పూర్తి సపోర్టుగా నిలవాలి.

వారితో కలిసిపోవాలి.మరి మీకు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి మరి.

తాజా వార్తలు