రోజంతా యాక్టివ్ గా ఉండాలనుకుంటున్నారా..? అయితే ఉదయం పూట వీటిని తప్పక తీసుకోండి..!

వేసవికాలం( summertime ) సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే మనం ఎలాంటి ఆహారం తీసుకున్న కూడా హైడ్రేట్ గా లేకుంటే మాత్రం నీరసంతో పడిపోవాల్సి వస్తుంది.

అందుకే వేసవికాలంలో ఆహార నియమాలను పాటించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఇక మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తే కొన్ని గంటల తర్వాత మీకు విపరీతమైన ఆకలి పుడుతుంది.

దీనితో మీరు అతిగా తినడానికి దారితీస్తుంది.ఇలా అతిగా తినడం వల్ల ఉబకాయం బారిన పడవచ్చు.

అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తినాల్సినవి ఏంటో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం.పొద్దున లేవగానే నీళ్లను తాగడం చాలా మంచిది.

Advertisement

కానీ చాలామంది ఎక్కువగా ఉదయం పూట నీళ్లను తాగరు.

నీళ్లు జీర్ణక్రియను( Digestion ) మెరుగుపరచడానికి, జీవక్రియను సులభతరం చేయడానికి సహాయపడతాయి.అందుకే తినడానికి ముందుగా ఉదయం పూట నీటిని తాగితే ఆకలి తగ్గుతుంది.దీంతో బరువు నియంత్రించుకోవచ్చు.

ఎక్కువగా నీటిని తాగడం వలన మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.చర్మం పొడి బారకుండా ఉంటుంది.

ఉదయాన్నే తినే ఆహారంలో ఫైబర్ ( Fiber )ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

దీంతో బరువును నియంత్రించుకోవచ్చు.అంతేకాకుండా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

Advertisement

దీని వలన రోజంతా హైడ్రేట్( Hydrate ) గా శక్తివంతంగా ఉండవచ్చు.

అలాగే బరువు తగ్గడానికి ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.ఇది ఆకలిని తగ్గించి హార్మోన్ల స్థాయిని పెంచి శరీరానికి వెంటనే ఎనర్జీని ఇస్తుంది.ఇక ఉదయం పూట చక్కర ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

ఎక్కువ మొత్తంలో స్వీట్నర్ లు శరీరానికి చేరడం వలన కడుపులో కొవ్వు పేరుకు పోతుంది.ఇది క్యాలరీలు పెరగడానికి కారణం అవుతుంది.

దీంతో బరువు పెరిగిపోతారు.అందుకే తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.

ఉదయం లేవగానే టీ లేదా కాఫీ( Tea or coffee ) తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.కానీ మన ఆరోగ్యానికి అసలు మంచివి కాదు.

వీటికి బదులుగా నిమ్మకాయ, తేనెను కలిపి గోరువెచ్చని నీటిని తాగితే జీవ క్రియ సులభతరం అవుతుంది.

తాజా వార్తలు