ఓటరు జాబితాలో అక్రమాలు..ఎన్నికల సంఘం వద్ద అడ్డంగా దొరికిపోయిన వైసీపీ!

ఆంధ్ర ప్రదేశ్ లో సరిగ్గా నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు జనాల్లోకి తమ తమ మ్యానిఫెస్టోలు మరియు సిద్ధాంతాలతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి.

టీడీపీ మరియు జనసేన( TDP , Jana Sena ) ఒక కూటమి గా ఏర్పడి రాబొయ్యే ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.మరోపక్క వైసీపీ పార్టీ మరోసారి అధికారం లోకి వచ్చేందుకు ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో, అన్నీ మార్గాలను ఎంచుకుంటుంది.

ఈ ప్రభుత్వం అభివృద్ధి సూన్యం అనే సంగతి అందరికీ తెలిసిందే.రాజధాని విషయం లో కూడా ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదు.

అవతల పక్క రాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశం లోనే మేటి సిటీలలో ఒకటిగా నిలిస్తే, అసలు రాజధాని లేని రాష్ట్రం గా మన ఆంధ్ర ప్రదేశ్ మిగిలిపోయింది, అందువల్ల ప్రభుత్వం పై వ్యతిరేకత ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది.

Advertisement

టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తే ఓటమి తథ్యం అనే విషయాన్ని అన్నీ సర్వేలు చెప్తుండడం తో ఎలా అయినా గెలవాలనే తపన తో వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లను సృష్టించిందని తెలుగు దేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది.ఈ సందర్భంగా ఆ పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ నాయకులూ ఎన్నికల సంఘం కి ఫిర్యాదు చేసారు.మన దేశం లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉపాధ్యాయుల సమక్షం లో జరుగుతుందని, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ వ్యవస్థతో ఎన్నికలు జరిపించే స్థితి వచ్చిందని చెప్పుకొచ్చాడు ఆయన.అంతే అక్టోబర్ 27 వ తారీఖున దేశవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో ఓటు వెరిఫికేషన్ ప్రక్రియ జరిగిందని, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ జరగలేదంటూ అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపుగా 10 లక్షల మంది ఫామ్ 6 , ఫాం 7, ఫాం 8 కి అప్లై చేసారని, వీటి పై ఎన్నికల సంఘం సరిగా ద్రుష్టి సారించలేదనే విషయాన్నీ కూడా ఆయన గుర్తు చేసాడు.గతం లో ఆంధ్ర ప్రదేశ్ ఒక కుటుంబానికి సంబంధించిన ఓట్లు ఒకే పోలింగ్ బూత్ పరిధిలోకి వచ్చేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇంట్లో 10 మంది ఉంటే ఆ పది మందికి వేరు వేరు పోలింగ్ బూతులు కేటాయిస్తున్నారని చెప్పుకొచ్చాడు.చనిపోయిన వారి పేర్లతో ఒకే వ్యక్తికీ రెండు ఓట్లు ఉండడాన్ని గమనించాము అంటూ ఆధారాలతో సహా ఆయన ఎలక్షన్ కమిషన్ కి నివేదిక అందించాడు.

దాదాపుగా 160 పోలింగ్ స్టేషన్ లు ఈసీ నిబంధలు విరుద్ధం గా ఉన్నాయని, దయచేసి వీటి అన్నిటిని పరిశీలించి దొంగ ఓట్లను రద్దు చెయ్యాలంటూ అచ్చెన్నాయుడు( Kinjarapu Atchannaidu ) ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు