ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన.. !

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటిస్తున్నారు.

ఈ మేరకు నాయకన్ గూడెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ముగ్గురు తొలిసారి జిల్లాకు వచ్చారు.కూసుమంచిలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ముగ్గురు మంత్రులు ప్రారంభించనున్నారు.

అక్కడి నుంచి పెద్ద ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకోనున్నారు.అక్కడ నివాళులు అర్పించిన తరువాత ఖమ్మం పాత బస్టాండ్ లో మహాలక్ష్మీ పథకాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు.

మరియు కొత్తగూడెం మరియు భద్రాచలం నియోజకవర్గాల్లో వీరు పర్యటించనున్నారని తెలుస్తోంది.మంత్రుల పర్యటన నేపథ్యంలో అటు అధికార యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ముగ్గురికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో పెద్ద పీట కల్పించిన సంగతి తెలిసిందే.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు