విశ్వక్, నేహా శెట్టి డాన్స్ పర్ఫార్మెన్స్.. క్షణాల్లో వీడియో వైరల్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఒకరు.

అనతి కాలంలోనే విశ్వక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.

సినిమా సినిమాకు వేరియేషన్స్ తో ప్రేక్షకులకు చేరువ అయిన విశ్వక్ ప్రస్తుతం మరో కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.కృష్ణ చైతన్య ( Krishna Chaitanya ) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

ఇక టైటిల్ గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న విశ్వక్ టీమ్ తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ఈ సినిమాపై మరింత హైప్ పెంచేశారు.సుట్టంలా సూసి అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టు కుంటుంది.

విశ్వక్, నేహా షీటీ రొమాన్స్ మాములుగా లేదు.వీరి కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది.ఇక ఈ సాంగ్ ను లాంచ్ చేసేందుకు చిన్న ఈవెంట్ ను ప్లాన్ చేయగా ఈ ఈవెంట్ లో కూడా విశ్వక్, నేహా శెట్టి స్టేజ్ మీదనే చేసిన పర్ఫార్మెన్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.

Advertisement

ఈ సాంగ్ లో విశ్వక్ ఎలాగైతే నేహా శెట్టి చీర లాగుతాడో అలాగే స్టేజ్ మీద కూడా చేసి అందరికి షాక్ ఇచ్చారు.

ఈ కొత్తరకం పబ్లిసిటీ చూసిన వారంతా నోరెళ్ల బెడుతున్నారు.మొన్నటికి మొన్న విజయ్, సమంత( Samantha ) ఖుషి మ్యూజికల్ ఈవెంట్ లో ఇలాంటి హాట్ రొమాన్స్ తో కూడిన పర్ఫార్మెన్స్ చేసారు.ఇక ఇప్పుడు విశ్వక్, నేహా కూడా అలాగే స్టేజ్ మీద డాన్స్ చేసారు.

దీంతో ఈ సినిమా కూడా భారీ హైప్ తెచ్చుకుంది.లీడ్ పెయిర్ ఈ తరహా డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులకు కొత్త పబ్లిసిటీ పరిచయం చేస్తున్నారు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు