మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా, శ్రీదివ్య హీరోయిన్‌గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ రాయుడు.
విశాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.
హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.హీరో కార్తీ కాంబినేషన్‌లో కొంబన్ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, ధనుష్ హీరోగా రూపొందిన రఘువరన్ బి.టెక్ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వేల్‌రాజ్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించడం విశేషం.ఈరోజు రాయుడు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాస్ హీరో విశాల్ మాట్లాడుతూ - నా కెరీర్‌లోనే ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది.పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న రాయుడు తప్పకుండా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను అన్నారు.
రాయుడు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి మాట్లాడుతూ - రాయుడు విశాల్ సినిమాల్లోనే ఒక క్రేజీ ఫిల్మ్ అవుతుంది.మే మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది.
మే మొదటి వారంలోనే ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నాం.మే 20న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మాస్ హీరో విశాల్, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్.కె.సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్, సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: బాబా భాస్కర్, సమర్పణ: విశాల్, దర్శకత్వం: ముత్తయ్య.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy