వైరల్ వీడియో: ఆ బుడ్డోడు ఆటను చూసి జూనియర్ ధోని అంటూ కితాబు ఇస్తున్న నెటిజన్స్..!

హెలికాప్ట‌ర్ షాట్ అన‌గానే క్రికెట్ ప్రియుల‌కు గుర్తొచ్చే ఒకే ఒక్క‌పేరు మ‌హేంద్ర‌సింగ్ ధోనీ.ఆయ‌న‌బ్యాటింగ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మ‌రి.

అంద‌రికంటే ఆయ‌న బ్యాటింగ్‌స్టైల్ కాస్త వేరేగా ఉంటుంది.ఎలాంటి యార్క‌ర్ల‌న‌ను అయినా స‌రేత‌న‌దైన స్టైల్‌లోహెలికాప్ట‌ర్ షాట్ ద్వారా బౌండ‌రీ లైన్ అవ‌త‌ల బంతి ప‌డేయ‌డం ధోనీ స్పెషాలిటీ.

ఇప్పుడు ఆయ‌న గురించి ఎందుకంటారా? ఓ బుడ్డోడు కూడా సేమ్ టు సేమ్ ధోనీలాగే హెలికాప్ట‌ర్ షాట్ ఆడుతున్నాడు.వాస్త‌వానికి ఈ హెలికాప్ట‌ర్ షాట్ ఆడాలని చాలా మంది క్రికేటర్లు ప్రయత్నించినా పెద్ద‌గా స‌క్సెస్ కాలేక విఫ‌లం చెందుతుంటారు.

చాలా కొంతమంది మాత్ర‌మే అది కూడా కొద్ది సార్లు మాత్ర‌మే ఈ షాట్ కొట్ట‌గ‌లిగారు.హెలికాప్టర్ షాట్ చాలా కేర్ ఫుల్ గా ఆడితేనే బాగుంటుంది. లేదంటే ఔట్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంది.

Advertisement
Viral Video: Netizens Who Are Giving The Book Called Junior Dhoni After Watching

ఈ షాట్‌ప ప్రాక్టీస్ లేకుండా ఆడితే బ్యాట్స్‌మెన్‌ ఔట్‌ కావడమో లేక గాయాలపాలు పక్కా ఈని నిపుణులు చెబుతున్నారు.

Viral Video: Netizens Who Are Giving The Book Called Junior Dhoni After Watching

ఈ కార‌ణాల‌తో చాలామంది దీన్ని ఆడ‌టానికి కాస్త ఆలోచించేవార‌.కానీ ఓ బుడ్డోడు మాత్రం ఈజీగా ఆడుతున్నాడు.అత‌ని హెలికాప్టర్ షాట్ కు అందరూ ఫిదా అయిపోతున్నారంటే న‌మ్మంది.

భారత మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఈ బుడ్డోడి హెలికాప్ట‌ర్ షాట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.పాదాల వద్ద యార్కర్ రూపంలో పడిన బంతిని కళ్లు చెదిరే విధంగా హెలికాప్టర్ షాట్ ఆడాడు ఆ బుడ్డోడు.

దీంతో మ‌నోడి షాట్ చూసి అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

Viral Video: Netizens Who Are Giving The Book Called Junior Dhoni After Watching
ఈ చిట్కాలు పాటిస్తే..వింట‌ర్‌లో మీ చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌ల్పించిన‌ట్టే!

అచ్చం ధోనీ అంటూ కొంద‌రు, మ‌రి కొంద‌రు ఫ్యూచ‌ర్ ధోనీ అంటూ కితాబిస్తున్నారు.భారత్‌ జట్టులోకి వచ్చిన కొత్తలో ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక హెలికాప్టర్‌ షాట్‌ ఆడుతూ కనిపించిన కూల్ కెప్టెన్ ధోనీ ఆ తర్వాత చాలా కాలం వ‌ర‌కు ఆ షాట్‌ను కాస్త ఆడ‌డం త‌గ్గించాడు.ఇందుకు అత‌నికి వెన్ను నొప్పి గాయం కూడా ఒక కారణమని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చేవి.

Advertisement

తాజా వార్తలు