వైరల్ వీడియో...గజరాజా మజాకా...అంతా బీ భత్సం చేసి చివరికి ఏం చేశాయంటే?

ఏనుగులు అంటే ఏదో ఒక మూల భయం వేయడం ఖాయం.ఎందుకంటే వాటి భారీ కాయానికి మరల ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు.

అందుకే ఏనుగు విషయంలో కొంత బెరుకుగా ఉంటుంది.అయితే ఏనుగులు అంత భారీ కాయం కలిగి ఉన్నా వాటికి కూడా మానవత్వం ఉంటుందనే విషయం రుజువయింది.

ప్రస్తుత సమాజంలో అధిక శాతం మనుషులలో లేని మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.మనం ప్రకృతిని రకరకాల రూపంలో నాశనం చేస్తూ, మూగ జీవాల పట్ల ఏ మాత్రం దయ లేకుండా ప్రవర్తించడం లాంటి పరిస్థితులున్న తరుణంలో మనుషులకు ఏనుగులు మూగజీవాల పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తున్నట్టు ఉంది ఈ ఘటన.ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళ నాడులో ఓ గ్రామంలోని ఓ అరటి తోటలో ఏనుగులు వీరంగం సృష్టించాయి.అయితే తోటలో ఉన్న అరటి పండ్లను తింటూ, చెట్లను కూలగొట్టి నానా హంగామా సృష్టించాయి.

అయితే ఇక్కడే ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైనదని చెప్పవచ్చు.అయితే తోటలోని అన్ని అరటి చెట్లను పడగొట్టిన ఏనుగులు ఒక్క చెట్టును మాత్రం వదిలేసాయి.

Advertisement

ఎందుకంటే ఆ చెట్టుకున్న అరటి గెలపై పక్షి గూడు ఉంది.అందులో చిన్న చిన్న పక్షులు ఉన్నాయి.

వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఏనుగులు చూపిన మానవత్వానికి నెటిజన్లు అవాక్కయ్యారనే చెప్పవచ్చు.

నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేస్తున్న ఈ వీడియోను మెరూ తిలకించండి.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు