వైరల్: ఆ చెట్లను నరకొద్దంటూ ఏకంగా ఆ బాలుడు..?!

చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారు.కొన్ని సార్లు తమకు నచ్చినదే కావాలని మారాం చేస్తారు.

దీంతో వారి అల్లరి శృతి మించుతోందని పెద్దలు వారిని కొడుతుంటారు.మంకుపట్టు పట్టొద్దని హెచ్చరిస్తారు.

అయితే ప్రస్తుత తరం పిల్లల ప్రవర్తన, అభిరుచి మారుతోంది.పెద్దల కంటే ఎక్కువగా వారికే టెక్ నాలెడ్జ్ ఉంటోంది.

అంతేకాకుండా చిన్న పిల్లలు కూడా తమ అభిరుచికి తగ్గట్టు నడుచుకుంటున్నారు.ఇక ఓ బాలుడు ఇటీవల చెట్టు ఎక్కి కూర్చున్నాడు.

Advertisement

తన కోరిక మన్నిస్తేనే కిందకు దిగుతానని భీష్మించాడు.అయితే అతడు కోరిందేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

తనకు ఎంతో ఇష్టమైన చెట్టు( Trees )ను నరకొద్దని వేడుకున్నాడు.చివరికి ఆ బాలుడి దెబ్బకు అధికారులు తలవంచారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్లను, వాటి కొమ్మలను ఆ శాఖ అధికారులు తొలగిస్తుంటారు.అంతేకాకుండా అభివృద్ధి పనుల కోసం రోడ్డు పక్కన ఉండే చెట్లను కూడా తొలగిస్తుంటారు.ఇలా చేసేటప్పుడు కొందరు మాత్రం అధికారుల తీరును వ్యతిరేకిస్తారు.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?

పచ్చని చెట్ల(trees )ను కొట్టొద్దని కోరతారు.అయితే పెద్దలకు కూడా లేని ధైర్యాన్ని ఓ బాలుడు చూపించాడు.

Advertisement

ఇటీవల తెలంగాణ( Telangana )లో ఇలాంటి ఓ ఆసక్తికర ఘటన జరిగింది.అధికారులకు చిన్న బాలుడు ఎదురు తిరిగి ధైర్యంగా నిలబడ్డాడు.

సంగారెడ్డి జిల్లా( Sangareddy ) రామచంద్రాపురంలో ఇటీవల కొందరు అధికారులు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు.ఇందుకోసం రోడ్డు పక్కనే ఉండే చెట్లను నరకడానికి సిద్ధమయ్యారు.

కాకతీయ నగర్‌లో మాత్రం వారి పనులకు ఆటంకం కలిగింది./br>

అనిరుద్ అనే బాలుడికి తమ ఇంటి ముందు ఉండే పెద్ద పెద్ద చెట్లు అంటే చాలా ఇష్టం.వాటిపై రకరకాల పక్షులు వస్తుంటాయి.వాటిని చూస్తూ ఆడుకుంటుంటాడు.

ఆ చెట్లను నరకడానికి అధికారులు వచ్చినప్పుడు బాలుడి చిన్ని మనసు తల్లడిల్లిపోయిందిత.అధికారులను చెట్లను నరకొద్దని చాలా వేడుకున్నాడు.

చివరికి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు.చెట్టు నరికొద్దని ఏడుస్తూ అధికారులను ప్రాధేయపడ్డాడు.

బాలుడు చెట్టుపై ఉండడంతో కాంట్రాక్టర్ ఆ చెట్లను తొలగించలేకపోయాడు.చివరికి అధికారులు ఆ బాలుడి కోరికను మన్నించారు.

చిన్న వయసులో చెట్ల సంరక్షణకు బాలుడు చేసిన పని వారిని మెప్పించింది.బాలుడు కోరినట్లే చెట్లు నరక్కుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తాజా వార్తలు