వైరల్ పిక్ : చేపల కోసం వల విసిరిన జాలరికి వింత అనుభవం..!

ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే అందరికి తెలిసిపోతుంది.

మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.

చేపల కోసం అని వేటకు వెళితే వివిధ రకాల జంతువులు వలలో చిక్కుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే చేపల వేటకు వెళ్లిన ఒక జాలరికి ఒక వింత అనుభవం ఎదురైయింది.

వలలో చేపలతో పాటు ఒక విచిత్రమైన జీవి కూడా ఉంది.దానిని చూసి ఆ జాలరి ఒక్కసారిగా బయపడిపోయాడు.

వెంటనే దానిని ఫోటో తీసి ఈ జీవి గురించి మీకు ఎవరికయినా తెలుసా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.వివరాల్లోకి వెళితే.

Advertisement

రష్యాలో ఉంటున్న 39 ఏళ్ల ఫెడోర్ట్ సోవ్ అనే ఒక జాలరి చేపలు పట్టేందుకు ఎప్పటిలాగానే సముద్ర తీరానికి వెళ్లి సముద్రంలోకి వల వేశాడు.కాసేపటికి వలను బయటకు లాగగా వలలో బాగానే చేపలు పడ్డాయి.

చేపలను చూసి కాసేపు ఆనందపడ్డాడు.కాసేపు అయ్యాక ఆ చేపలను బయటకు తీసే క్రమంలో వలలో చిక్కిన ఒక జీవిని చూసి ఆనందం కాస్త ఆవిరి అయింది.

ఆ జీవిని చూసి ఫెడోర్ట్ భయంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసాడు.ఎందుకంటే ఆ జీవి చూడడానికి చాలా భయంకరంగా ఉంది.

జీవిని అసలు ఎప్పుడు చూడనేలేదు.ఇంకా వెంటనే ఫోన్ లో ఆ జీవిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

ఫొటోలో కనిపించే జీవిని ఒకసారి పరిశీలించి చూస్తే చేప మాదిరిగానే ఉంది కానీ చేప కాదు.ఆ జీవికి రెక్కలు, పెద్ద కళ్లు, పొడవైన తోక కూడా ఉన్నాయి.

Advertisement

ఆ ఫొటోలో ఉన్న జీవి ఏంటి అని చాలా మంది నేటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేసారు.కాగా సముద్ర జీవుల గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి మాత్రం అది ఘోస్ట్ షార్క్ అయి ఉండవచ్చని అనుమానం అయితే వ్యక్తం చేసారు కానీ స్పష్టత అయితే ఇవ్వలేదు.

తాజా వార్తలు