వైరల్: మతిపోయిందా ఈయనికి, రన్నింగ్‌ కారుపై గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు చూడండి!

నేడు అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చి చేరిపోయాయి.దాంతో సోషల్ మీడియా వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

ఈ క్రమంలో ప్రపంచం నలుమూలలా జరిగిన గమ్మత్తైన విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి.అవును, తాజాగా ఓ విచిత్రమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దాన్ని చూసిన నెటిజన్లు చాలా భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.విషయంలోకి వెళితే, అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీలో ఓ బిజీ స్ట్రీట్‌లో పార్క్ చేసి ఉన్న కారు ముందు విండ్ షీల్డ్‌పై ఒక వ్యక్తి గుర్రుపెట్టి నిద్ర పోతున్నాడు.

అయితే అతడిని ఆ కారు ఓనర్ లేపకుండానే కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.కంటపడిన ఈ దృశ్యాన్ని పాల్ బ్లెయిర్ అనే ఒక ట్విటర్ యూజర్ తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించి తన ట్విటర్‌ అకౌంట్ వేదికగా పోస్ట్ చేశాడు.

Advertisement

దాంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.సదరు వ్యక్తి విండ్ షీల్డుపై తల పెట్టి కారు బానెట్‌పైన అలానే జారిపోకుండా పడుకుని ఉన్నాడు.

కారు ఓనర్ మరి ఏమనుకున్నాడో గాని, వేగంగా పోనిస్తే అతడు పడిపోతాడేమో అని అనుకున్నాడో గాని, కారుని నెమ్మదిగా రోడ్డుపైన పోనిస్తున్నాడు.సదరు దృశ్యాన్ని నెటిజన్లు చూస్తూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

బాగా మద్యం మద్యం మత్తులో కారుపై పడుకుని నిద్రపోయినట్టున్నాడు అని ఒకరంటే, కారు కదులుతున్నప్పటికీ అతడిలో చలనం లేదేమిటి అని మరికొందరు, కారు ఓనర్ కి దండం పెట్టాలి అని ఇంకొకరు, తగిన మైకంలో స్వర్గంలో విహరిస్తున్నాడు అని వేరొకరు.ఇలా ఎవరికి తోచింది వారు కామెంట్ చేస్తున్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement

తాజా వార్తలు