వైరల్: బురద నీటిలో కుర్రాడు... మిలియన్ల వ్యూస్, ఎందుకంటే?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏమూలన జరిగిన విషయం కూడా ఇట్టే తెలిసి పోతుంది.

సాధారణ వీడియోలు కంటే విభిన్నంగా వున్న వీడియోలే నెటిజన్లు ఎక్కువగా ఆదరిస్తారు.

అయితే కొన్నిసార్లు అందులో ఎలాంటి అద్భుతాలు వుండవు.కానీ సదరు వీడియోలు మాత్రం తెగ వైరల్ అవుతుంటాయి.

అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.కాగా ఈ వీడియోను ఇప్పటిదాకా కోటి మందికి పైగా చూడడం కాస్త విడ్డురమే అని చెప్పుకోవాలి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే వర్షానికి ఓ మట్టి రోడ్డుపై వరద నీరు భారీగా నిలిచి ఉంటుంది.నీటిని తొలగించేందుకు ఓ వ్యక్తి ముందుకు రావడం ఇక్కడ ప్రత్యేకతని సంతరించుకుంది.

Advertisement

అందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా? అంత నీటిని ఆ ఒక్క వ్యక్తి ఒక్కడే తొలగించడం ఇక్కడ పెద్ద విషయం అయింది.దానికి అతగాడు ఉపయోగించిన ట్రిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

సింపుల్‌గా ఓ పొడవాటి కర్ర పట్టుకుని అక్కడికి వచ్చి, రోడ్డు మధ్యలో కర్రతో నీళ్లలో అటూ ఇటూ తిప్పుతూ ఉంటాడు.కట్ చేస్తే ఒక్క నిమిషంలోనే అక్కడి నీళ్లు మాయం అవుతాయి.

ఇక్కడ గమనిస్తే.అక్కడ మ్యాన్‌హోల్ ఉండడం చూడవచ్చు.దానిపై ఉన్న ఇనుప గ్రిల్ చెత్తాచెదారంతో నిండిపోవడం వల్ల.వరద నీరు మొత్తం నిలిచిపోయింది.

ఇంతసేపు అతను మ్యాన్‌హోల్ గ్రిల్‌ను గుర్తించేందుకే అలా చేశాడని.మనకు అర్థమవుతుంది.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

కాగా ఈ వీడియోను ప్రస్తుతం కోటి మందికి పైగా చూడడం విశేషం.అలాగే దానికి లక్షల కొద్దీ లైకులు వచ్చిపడుతున్నాయి.

Advertisement

అంతేకాదండోయ్.అతగాడు చేసిన సమాజ సేవకి నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

తాజా వార్తలు