వైరల్: ఆహారాన్ని దొంగతనం చేస్తున్న పక్షి.. ఏకంగా సూపర్‌ మార్కెట్‌కే ఎసరు పెట్టింది!

ఆకలి ఎవ్వరికైనా ఒక్కటే.ప్రకృతి మీద ఆధిపత్యం వహిస్తున్న మనిషి వలన ఎన్నో ప్రాణులు నేడు విలవిలలాడుతున్నాయి.

పక్షులకు ఎక్కడ కూడా ఆహారం దొరకకుండా పోతుంది.అదే మన చిన్నతనంలో పక్షులకు అలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు.

అవి తమ నివాసాలలో వుంటూ, ఆహారాన్ని వెతుక్కొనేవి.అయితే నేడు పరిస్థితి తారుమారయ్యింది.

తమ స్వలాభాలకోసం మానవుడు అడవులను నరికేయడం వలన వాటికి నేడు దారుణమైన దుస్థితి ఏర్పడింది.అందుకే కొన్ని పక్షులు జాతులు ఇపుడు అంతం అయిపోతున్నాయి.

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళితే, విదేశాల్లో సీగల్ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి.సీగల్ చూడటానికి పావురంలా కనిపిస్తుంది కానీ నిజానికి అవి పావురాలు కావు.

ఇవి పావురాల కంటే కాస్త పెద్ద సైజులో ఉంటాయి.ఒకప్పుడు ఇవి సముద్రాలు, సరస్సుల దగ్గర చేపల్ని తింటూ బతికేవి.

ఇక కాలక్రమంలో సరస్సులు ఇంకోపోయి, చేపలు దొరకకపోవడంతో.ఇపుడు ఇవి జనావాసాలలోకి రావడం ప్రారంభించాయి.

ఎక్కడ ఆహారం కనిపించినా ఇవి దాడి చేసి మరీ తినేస్తున్నాయి.చిన్న జీవులైనా, వాటికి జరిగిన అన్యాయం గురించి మరి వాటికి తెలిసిందేమో.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఇవి మనషులపై దాడి చేస్తూ చేతిలో ఆహారాన్ని కూడా ఎత్తుకుపోయిన ఘటనలు వున్నాయి.

Advertisement

అయితే తాజాగా జరిగిన ఓ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇవి ఇపుడు సూపర్ మార్కెట్లలోకి చొరబడి ఆహారాన్ని దోచుకుంటున్నాయి.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వస్తున్నాయి.

తాజాగా ఓ సీగల్ పక్షి.ఇలాంటి దొంగతనం చేసి కెమెరాకు చిక్కింది.ఇది ఓ సూపర్ మార్కెట్ నుంచి ఇప్పటివరకూ £300 (రూ.29,000) విలువైన ఆహారం ఎత్తుకుపోయిందని సమాచారం.బ్రిటన్.

దేవన్‌లోని టెస్కో ఔట్‌లెట్‌ నుంచి ఆ పక్షి తరచూ చోరీలకు పాల్పడుతోందని స్థానికులు చెబుతున్నారు.ఈ పక్షి బయటి ఆహారం తినడం మానేసి.

పూర్తిగా షాపుపైనే ఆధారపడుతోందని అంటున్నారు.ఆకలి వేసినప్పుడల్లా.

రకరకాల చిప్స్ ప్యాకెట్లను ఎత్తుకుపోతోంది.ఈ పక్షి చోరీలు చేస్తున్న ఫొటోలు, వీడియోలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.