Vinodhaya Sitham : వరిజినల్ వినోదయ సీతం (5 కోట్లు) కి, బ్రో మూవీ(75 కోట్లు ) కి ఉన్న తేడాలు గమనించారా ?

ఈ శుక్రవారం థియేటర్స్ లో విడుదల బ్రో సినిమా( BRO MOvie ) గురించి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూడగా సినిమా చుసిన ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా ఉంది.

ఏది ఏమైనా ఒక సినిమా టాక్ పూర్తిగా తెలియడానికి ఒకటి లేదా రెండు రోజుల టైం పడుతుంది.

ఇక ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వినోదయ సీతం( Vinodhaya Sitham ) అనే సినిమా కు రీమేక్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగ బ్రో తెలుగు మూవీ కి తమిళ్ వినోదయ సీతం మూవీ కి ఉన్న తేడాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదట ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే వినోదయ సీతం కి పెట్టిన డబ్బు కేవలం 5 కోట్లు, కానీ బ్రో కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 75 కోట్ల రూపాయలను బడ్జెట్ గా పెట్టింది.కథ విషయానికి వస్తే తమిళ్ లో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని రాయగా, తెలుగు లో మాత్రం త్రివిక్రమ్( Trivikram ) రాయగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథకు కాస్త కామర్హియల్ హంగులు జోడించారు.ఇక తమిళ్ వెర్షన్ 99 నిముషాల నిడివి తో విడుదల కాగా, తెలుగు మాత్రం 135 నిముషాలుగా వచ్చింది.

వినోదయ సీతం లో ఒక్క పాట కానీ, ఫైట్ కానీ లేవు.కానీ తెలుగులో 5 పాటలు, 2 ఫైట్స్ ఉన్నాయ్.

Advertisement

తమిళ్ లో నటించిన పరశురామ్ అనే పాత్ర వయసు 60 ఏళ్ళు, ఆ పరిస్థితిలో చనిపోతే ఇంట్లో ఉండే పరిస్థితులను చక్కబెట్టానికి టైం వస్తుంది.కానీ సాయి ధరమ్ తేజ్ పరశురామ్ పాత్ర చేసాడు కాబట్టి 30 ఏళ్ళ యువకుడి పాత్ర కు ఉండే పరిస్థులను కల్పించాడు దర్శకుడు.ఇక వినోదయ సీతం లో తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ఉంటుంది.

కానీ తెలుగు లో అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ ఉంటుంది.ఇక పవన్ కళ్యాణ్ కోసం పాత్ర నిడివి బాగా పెంచి తమిళ కుటుంబ చిత్రాన్ని కాస్త మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మార్చారు బ్రో మూవీ లో.రెండిటికి దర్శకత్వం వహించింది సముద్రఖని( Samuthirakani ) అయినప్పటికీ వినోదయ సీతం లో ఉన్న డెప్త్ బ్రో సినిమాలో లేదు అనే మాట వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు