డుబల్ ట్రీట్ మోసుకొస్తున్న విజయశాంతి

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న లేడీ అమితాబ్ విజయశాంతి లుక్ ఎట్టకేలకు దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారు సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్.

చాలా కాలం తరువాత రీఎంట్రీ ఇస్తోన్న విజయశాంతి ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందా అని ఆతృతగా చూస్తున్నారు ఆమె అభిమానులు.

అయితే దీపావళికి ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహానికి చిత్ర యూనిట్ తెరదించింది.దీపావళి కానుకగా అక్టోబర్ 26 ఉదయం 9.09 నిమిషాలకు విజయశాంతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.ఇక దీంతో పాటు మరో డబుల్ ట్రీట్‌ను కూడా చిత్ర యూనిట్ ఇవ్వనుంది.సాయంత్రం 5.04 గంటలకు మహేష్ సరికొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు.ఇప్పటికే రిలీజైన మహేష్ రెండు పోస్టర్లు అభిమానులలో అత్యంత ఆసక్తిని రేకెత్తించాయి.

ఇప్పుడు విజయశాంతి ఫస్ట్‌లుక్‌తో పాటు మహేష్ మరో లుక్‌ను రిలీజ్ చేస్తుండటంతో మహేష్ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.మరి రాములమ్మ పోస్టర్ ఎలాంటి రచ్చ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే!.

Advertisement