ల్యాండర్‌ విక్రమ్‌ జాడ దొరికేనేమో కాని కేసీఆర్‌ బడ్జెట్‌ లెక్కల వాస్తవాలు దొరకడం కష్టం : విజయశాంతి

ఈమద్య కాలంలో కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సీఎం కేసీఆర్‌లపై విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.

ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంది.

సీఎం కేసీఆర్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తున్న విజయశాంతి నేడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై విమర్శలు చేసింది.చంద్రయాన్‌ 2 ప్రయోగంలో కనిపించకుండా పోయిన ల్యాండర్‌ విక్రమ్‌ జాడ కనుక్కోవచ్చు కాని కేసీఆర్‌ లెక్కల గారడి వాస్తవాలను కనుక్కోవడం ఎవరి వల్ల కాదంటూ ఎద్దేవ చేసింది.

గత బడ్జెట్‌ లెక్కలు పూర్తి కాకుండానే కేసీఆర్‌ ఈసారి మళ్లీ లెక్కల గారడి చేశారంటూ విమర్శించింది.ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కనీస సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తి విఫలం అయ్యింది.

గత బడ్జెట్‌లో కేటాయింపులు చేసిన నిధులు ఏ విధంగా ఖర్చు అయ్యాయి అనే విషయంప వివరణ ఇవ్వాలని, లెక్కల గారడీ చేయకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా బడ్జెట్‌ తీసుకు రావాల్సిన ప్రభుత్వం మోసానికి పాల్పడిందంటూ కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.మరో వైపు టీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement
జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

తాజా వార్తలు