బీజేపీ లో లొల్లి : ఈటెల ను టార్గెట్ చేసుకున్న విజయశాంతి ! 

బీజేపీ లో కోవర్ట్ లు ఉన్నారు అంటూ ఇటీవలే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

ఇప్పటికే ఈటెల వ్యాఖ్యల పై తెలంగాణ బిజెపి కీలక నాయకులంతా స్పందించారు.

అయితే వీరంతా ఈటల రాజేందర్ చేసిన విమర్శలను కొట్టు పారేస్తూ,  అసలు తెలంగాణ బిజెపిలో కోవర్ట్ లే లేరు అంటూ వ్యాఖ్యానించారు.తాజాగా ఈటెల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి నేత విజయశాంతి స్పందించారు.

కోవర్ట్ ల ను పేర్లతో సహా బయటపెట్టాలంటూ ఆమె ఈటెల రాజేందర్ ను డిమాండ్ చేశారు.

Vijayashanthi Comments On Etela Rajendar About Converts Issue , Telangana

నిజంగా కోవర్టులు ఉంటే కేంద్రం కూడా వారిపై చర్యలు తీసుకుంటుందని,  వారి గురించి నిజాలు బయట పెట్టండి .దీంతో పార్టీకి మీరు మేలు చేసిన వారు అవుతారు అంటూ ఈటెల రాజేందర్ ను ఉద్దేశించి విజయశాంతి కామెంట్ చేశారు.ఊరికే కోవర్ట్ లు ఉన్నారని చెప్పి తప్పించుకోవడం కాదంటూ ఘాటుగా స్పందించారు.

Advertisement
Vijayashanthi Comments On Etela Rajendar About Converts Issue , Telangana

ఒక దొంగతనం జరిగినప్పుడు దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.ఇక ఇప్పటికే రాజేందర్ చేసిన కోవర్ట్ వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.

Vijayashanthi Comments On Etela Rajendar About Converts Issue , Telangana

బిజెపిలో కోవర్ట్ లు ఉండరు అని, బీజేపీ సిద్దాంతాలు కలిగిన పార్టీ అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో పాటు,  పార్టీలో ని కీలక నేతలు ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు.దీంతో కోవర్ట్ ల వ్యవహారం పై తనకు  అన్ని విధాలుగా మద్దతు లభిస్తుందని భావించిన రాజేందర్ కు ఇప్పుడు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదట.

ఇక ఈ వ్యవహారం పై బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో ? .

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు