చంద్రబాబు జైల్ లో దోమలు అంటూ టీడీపీ నేతల వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి కౌంటర్..!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు( Chandrababu ) రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

దాదాపు రెండు వారాల నుండి చంద్రబాబు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు.

చంద్రబాబుని బయటకు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ టీం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది.అయితే సమయంలో జైలులో చంద్రబాబు అనేక అవస్థలు పడుతున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

Vijayasai Reddy Comments On Twitter If Mosquitoes Hit Chandrababu They Will Die

ఇక ఇదే సమయంలో ఇటీవల జైలులో ఓ ఖైదీ డెంగ్యూ జ్వరం( Dengue ) వల్ల మరణించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.చంద్రబాబు స్నేహ బిల్డింగ్ లో దోమలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని.

వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శలు చేయడం జరిగింది.ఈ క్రమంలో విజయసాయిరెడ్డి.

Advertisement

( Vijayasaireddy ) జైలులో చంద్రబాబునీ దోమలు కుడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకి ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు."క్రిమికీటకాల నిజనిర్దారణ కమిటీ పరిశీలన.

చంద్రబాబు గారిని కుట్టిన వెంటనే దోమలు గుండె(వెన్ను)పోటుకుగురై చనిపోతున్నాయట! దీనిపై దోమల సంక్షేమ కమిటీ తీవ్రంగా స్పందించి చంద్రబాబుగారిపై అంతర్జాతీయ క్రిమికీటకాల న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాయట! ఇప్పుడు ఆ కేసులో కూడా పీటీ వారెంట్ వస్తే దానికి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా ఉన్నారు మన ఫ్రస్ట్రేటెడ్ తెలుగు తమ్ముళ్లు" అని విజయసాయి రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు