అందరి దృష్టి మా పైనే... అసౌకర్యంగా అనిపించింది: విజయ్ వర్మ

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న( Thamannah ) బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma ) ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇలా వీరి ప్రేమ విషయాన్ని అందరి ముందు బహిరంగంగా తెలియజేశారు.

ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే విషయం తెలియడంతో వీరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే పలు సందర్భాలలో విజయ్ వర్మ తమన్నా గురించి తన ప్రేమ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

అయితే తాజాగా మరోసారి విజయ్ వర్మ మాట్లాడుతూ వారి ప్రేమ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా విజయ్ వర్మ మాట్లాడుతూ.ప్రేక్షకుల ఆదరణ పొందిన జంటలలో మేము కూడా ఉన్నాము అనే విషయం నాకు అసలు తెలియదని ఈయన తెలియచేశారు.ఇది నాకు గుడ్ న్యూస్ ఇలా వాళ్ళ ఆదరణ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈయన తెలియజేశారు.

Advertisement

అయితే మొదట్లో నేను ఈ విధంగా ఉండే వ్యక్తిని అసలు కాదని విజయ్ వర్మ తెలిపారు.నేను తమన్నాతో ప్రేమలో పడిన తర్వాత ఇద్దరం కలిసి బయటకు వెళ్తే అందరి దృష్టి మాపైనే ఉండేదని తెలిపారు.

ఇలా అందరూ మమ్మల్ని ఫోకస్ చేయడం వల్ల తనకు చాలా అసౌకర్యంగా అనిపించేది.అయితే ప్రస్తుతం నేను కూడా వీటికి అలవాటు పడుతున్నాను అంటూ విజయ్ వర్మ తమన్నతో ప్రేమ గురించి, ప్రేమలో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను గురించి తెలియజేశారు.అయితే వీరిద్దరూ ఈ ఏడాది జనవరిలో నూతన సంవత్సరం సందర్భంగా బహిరంగంగా లిప్ లాక్ పెట్టుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించారు అయితే కొంతకాలం పాటు తరచూ జంటగా కనిపించిన వీరిద్దరూ ప్రేమ విషయాన్ని వెల్లడించలేదు.

అయితే వీరి రిలేషన్ గురించి తరచూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు