నిహారికకు హీరో దొరికాడోచ్..!

మెగా డాటర్ నిహారికతో చేసేందుకు కుర్ర హీరోలు వెనుకడుగేస్తున్న వార్త కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నిహారికతో నటిస్తే ఆమెతో క్లోజ్ గా మూవ్ అవడం మెగా అభిమానులకు నచ్చదని తెలియడంతో ఆమెతో సినిమా అంటే మాకొద్దు బాబోయ్ అనే పరిస్థితి వచ్చింది.

సినిమా ప్రమోషన్స్ లో కూడా నిహారిక పక్కన తమ పరిస్థితి మరి అద్వానంగా ఉందనే రూమర్ ఉంది.ఈ కారణాలతో నిహారికతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్న దర్శకులు ఇప్పుడు హీరోలను వెతికే పనిలో ఉన్నారు.

అయితే రీసెంట్ గా పెళ్లిచూపులు సినిమాతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ నిహారిక హీరోయిన్ గా చేస్తున్న సినిమాకు హీరోగా సెలెక్ట్ అయ్యాడట.ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు చేసిన రెండు సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ తో సినిమా అంటే దర్శక నిర్మాతలు మంచి పాజిటివ్ ఫీల్ తో ఉన్నారు.

ఓ రకంగా నిహారిక పక్కన ఛాన్స్ అంటే విజయ్ కు కూడా మెగా ఆఫర్ అని చెప్పాలి.మరి షార్ట్ టైంలో రెండు సినిమాలతో క్రేజ్ సంపాదించిన విజయ్ రానున్న రోజుల్లో ఇంకెంత జోరు కొనసాగిస్తాడో చూడాలి.

Advertisement

చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెళ్లిచూపులు మంచి వసూళ్లతో ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ప్రయత్నంలో ఉంది.

ఇంద్ర సినిమాలో సుద్దాల పాటను తీసేయడానికి కారణం ఏంటంటే..!?
Advertisement

తాజా వార్తలు