'ఫ్యామిలీ స్టార్' షూట్ అప్డేట్.. బ్యాంకాక్ వెళ్లిన టీమ్!

యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.

ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని స్టార్ హీరోల సరసన చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

అందుకోసం విజయ్ చాలానే కష్ట పడుతున్నాడు.ఇక ఇటీవలే విజయ్ ఖుషి సినిమాతో హిట్ అందుకున్నాడు.

కానీ ఈ సినిమా ఇతడికి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇవ్వలేక పోయింది.దీంతో మళ్ళీ ఒక అడుగు దూరంలోనే ఆగి పోయాడు.

ఖుషి తర్వాత మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.అందులో పరశురామ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ( VD13 ) ఒకటి.

Advertisement

విజయ్ కు గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో మరోసారి చేతులు కలిపాడు.

ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ ( Mrinal Thakur )హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా గురించి తాజాగా నెట్టింట ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా సంక్రాంతికి అని ప్రకటించడంతో టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.తాజాగా టీమ్ అంతా లాంగ్ షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లినట్టు తెలుస్తుంది.

రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ షూటింగ్ నవంబర్ చివరి నాటికీ పూర్తి అయ్యేట్టు కనిపిస్తుంది.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు